- Telugu News Photo Gallery Cinema photos Anudeep kv and Aditya haasan gets huge craze in Tollywood in premalu movie event Telugu Entertainment Photos
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. అంటూ పోకిరిలో పూరీ రాసిన డైలాగ్ ఇండస్ట్రీలో కొందరు కుర్ర దర్శకులకు బాగా సరిపోతుందిప్పుడు. ఒకట్రెండు సినిమాలతోనే మార్కెట్‌లో వాళ్లకొచ్చిన క్రేజ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. మరి ఆ రేంజ్‌లో మ్యాజిక్ చేస్తున్న ఆ దర్శక రత్నాలెవరు..? వాళ్ళంతగా ఏం మ్యాజిక్ చేసారు..? తెలుగు ఇండస్ట్రీలో దర్శక ధీరుడు అంటే రాజమౌళి అని అందరికీ తెలుసు.. కానీ దర్శక రత్నం కూడా ఉన్నారు.. అతడే అనుదీప్ కేవీ.
Updated on: Mar 15, 2024 | 9:57 PM

ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. అంటూ పోకిరిలో పూరీ రాసిన డైలాగ్ ఇండస్ట్రీలో కొందరు కుర్ర దర్శకులకు బాగా సరిపోతుందిప్పుడు. ఒకట్రెండు సినిమాలతోనే మార్కెట్‌లో వాళ్లకొచ్చిన క్రేజ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది.

మరి ఆ రేంజ్‌లో మ్యాజిక్ చేస్తున్న ఆ దర్శక రత్నాలెవరు..? వాళ్ళంతగా ఏం మ్యాజిక్ చేసారు..? తెలుగు ఇండస్ట్రీలో దర్శక ధీరుడు అంటే రాజమౌళి అని అందరికీ తెలుసు.. కానీ దర్శక రత్నం కూడా ఉన్నారు.. అతడే అనుదీప్ కేవీ.

జాతి రత్నాలు సినిమాతో ఈయనకు వచ్చిన క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఆ తర్వాత ప్రిన్స్ వచ్చి ఫ్లాపైనా.. ఇంకా జాతి రత్నాలు క్రేజ్‌తోనే ముందుకెళ్తున్నారు అనుదీప్ కేవీ.

ఈయన స్టేజ్ ఎక్కితే చాలు హీరో కంటే ఎక్కువ అరుస్తుంటారు ఆడియన్స్. సినిమాల్లోనే కాదు.. బయట కూడా అనుదీప్ ప్రతీమాటా సెటైర్ మాదిరే ఉంటుంది. అదే తన సినిమాలకు హెల్ప్ అవుతుంది కూడా.

త్వరలోనే రవితేజతో సినిమా చేయబోతున్నారు ఈ జాతి రత్నం. ఇప్పుడు అనుదీప్ కేవీకి తోడు 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ కూడా ట్రెండ్ అవుతున్నారు. ప్రేమలు సినిమాకు ఈయన రాసిన డైలాగ్స్ మామూలుగా పేలలేదు.

కుమారి ఆంటీ నుంచి మొదలుపెట్టి కూకట్ పల్లి ఫ్లై ఓవర్ వరకు దేన్ని వదల్లేదు ఆదిత్య హాసన్. మలయాళం డబ్బింగే అయినా.. ప్రేమలు సినిమాకు ఆదిత్య రాసిన డైలాగ్స్‌కు ఫిదా అయ్యారు ప్రేక్షకులు.

తాజాగా ప్రేమలు సక్సెస్ మీట్‌లో ఆదిత్య, అనుదీప్ కేవీ స్పీచులు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా సినిమాల కంటే ఎక్కువగా ఆటిట్యూడ్‌తోనే పాపులర్ అవుతున్నారు ఈ ఇద్దరూ.




