Mix Up OTT: డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ ఎంటర్ టైనర్.. మిక్స్ అప్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (మార్చి 15) కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెట్టాయి. అలా ఈ వారం చాలా మంది దృష్టిని ఆకర్షించిన చిత్రం మిక్స్ అప్‌. టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా ఇప్పుడు డైరెక్టుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Mix Up OTT: డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ ఎంటర్ టైనర్.. మిక్స్ అప్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Mix Up Movie Review
Follow us
Basha Shek

|

Updated on: Mar 15, 2024 | 4:23 PM

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (మార్చి 15) కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెట్టాయి. అలా ఈ వారం చాలా మంది దృష్టిని ఆకర్షించిన చిత్రం మిక్స్ అప్‌. టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా ఇప్పుడు డైరెక్టుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆకాశ్ బిక్కీ తెరకెక్కించిన ఈ బోల్డ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజా జావేరి కీలకపాత్రలు పోషించారు. హైమా వర్షిణి కథ అందించారు. తిరుమల్ రెడ్డి అమిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కౌశిక్ సంగీతం అందించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న మిక్స్ అప్ సినిమా డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (మార్చి 15) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. ‘ప్రేమ గొప్పదా? కామం గొప్పదా’ అంటూ మిక్స్ అప్‌ సినిమా టీజర్స్ , ట్రైలర్లు రిలీజ్ చేసినప్పుడే అర్థమైంది ఇది బోల్డ్ కంటెంట్ మూవీ అని. సో కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడడం కాస్త ఇబ్బందే అని చెప్పుకోవచ్చు.

మిక్స్ అప్ సినిమా కథేంటంటే..

మిక్స్ అప్ సినిమాలో ఆదర్శ్ – అక్షర గౌడ, కమల్ కామరాజ్ – పూజా పెళ్లయిన రెండు జంటలుగా నటించారు. అయితే శృంగార పరంగా వారి మధ్య భిన్నాభిప్రాయలు తలెత్తుతాయి. దీంతో వారి మధ్య రిలేషన్ షిప్ కూడా దెబ్బతింటుంది. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి అందరూ ఓ స్పెషలిస్ట్ దగ్గరకు వెళతారు. అక్కడ ఆయన విడిపోయేందుకు తొందర పడకుండా కొంత సమయం తీసుకోవాలని సూచిస్తారు. ఇది జరిగిన ఆ తర్వాత ఆ నలుగురి మధ్య ఊహించని సంఘటనల జరుగుతాయి. మరి చివరకు ఏమైందన్నదే మిక్స్ అప్ సినిమా స్టోరీ.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

మిక్స్ అప్ ట్రైలర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి