Mission Chapter 1 OTT: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన అమీజాక్సన్ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?

కోలీవుడ్ స్టార్ హీరో, సాహో ఫేమ్‌ అరుణ్ విజయ్, బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ జంటగా నటించిన చిత్రం మిష‌న్ చాఫ్ట‌ర్ వ‌న్‌. గతంలో ఎవడు, ఐ లాంటి పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన అమీ జాక్సన్ సుమారు ఆరేళ్ల తర్వాత ఇదే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఏ ఎల్‌ విజయ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది

Mission Chapter 1 OTT: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన అమీజాక్సన్ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?
Mission Chapter 1 Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 15, 2024 | 3:43 PM

కోలీవుడ్ స్టార్ హీరో, సాహో ఫేమ్‌ అరుణ్ విజయ్, బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ జంటగా నటించిన చిత్రం మిష‌న్ చాఫ్ట‌ర్ వ‌న్‌. గతంలో ఎవడు, ఐ లాంటి పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన అమీ జాక్సన్ సుమారు ఆరేళ్ల తర్వాత ఇదే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఏ ఎల్‌ విజయ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. అయితే తెలుగులో భారీగా పోటీ ఉండడంతో తెలుగు వెర్షన్ రిలీజ్ చేయకపోయారు. అయితే తమిళంలో మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన మిషన్ ఛాప్టర్ వన్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా రెండు ఓటీటీల్లో. శుక్రవారం (మార్చి 15) అర్ధరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, అలాగే సింప్లీ సౌత్ లలో మిషన్ ఛాప్టర్ వన్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. మరికొన్ని రోజుల్లో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అయితే ప్రస్తుతం తమిళ్ వెర్షన్ కు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి మిష‌న్ చాఫ్ట‌ర్ వ‌న్‌ చూడాలనుకునేవారు ఓ లుక్ వేసుకోవచ్చు.

మిషన్ చాప్టర్ వన్ చిత్రంలో నిమిషా సజయన్, భరత్ భూపన్న, అభి హాసన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా జీవీకి ఇది 100వ సినిమా కావడం విశేషం. సందీప్ కె. విజయ్ ఛాయాగ్రహణం, ఆంథోని ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్, యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉన్న మిషన్ ఛాప్టర్ వన్ సినిమా యాక్షన్ ప్రియులకు ఒక మంచి ఛాయిస్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.