Anveshi OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అనన్య నాగళ్ల థ్రిల్లర్ మూవీ.. ‘అన్వేషి’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ సంస్థలు కూడా తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎక్కువగా ఇలాంటి జానర్ సినిమాలనే అందుబాటులోకి తెస్తాయి. అలా గతేడాది థియేటర్లలో విడుదలైన ఒక హార్రర్ థ్రిల్లర్ సినిమా ఒకటి సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది
ఓటీటీల్లో కొన్ని జానర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. మరీ ముఖ్యంగా హార్రర్, థ్రిల్లర్, క్రైమ్, సస్పెన్స్ జానర్ సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందుకు తగ్గట్టే ఓటీటీ సంస్థలు కూడా తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎక్కువగా ఇలాంటి జానర్ సినిమాలనే అందుబాటులోకి తెస్తాయి. అలా గతేడాది థియేటర్లలో విడుదలైన ఒక హార్రర్ థ్రిల్లర్ సినిమా ఒకటి సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల హీరోయిన్ గా చేసిన సినిమా అన్వేషి. విజయ్ ధరణ్ హీరోగా నటించగా, సిమ్రన్ గుప్తా సెకెండ్ లీడ్ హీరోయిన్ గా చేసింది. గతేడాది నవంబర్ 10న థియేటర్లలో విడుదలైన అన్వేషి సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కంటెంట్ బాగుందని ప్రశంసలు వచ్చినా స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అలాగే పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడం, ఇదే సమయంలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ కావడంతో అన్వేషి థియేటర్లలో జస్ట్ యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అన్వేషి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (మార్చి 15)అర్ధరాత్రి నుంచే అన్వేషి సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది.
అయితే ప్రస్తుతానికి అన్వేషి సినిమా రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తమ సబ్ స్క్రైబర్లకు ఉచితంగా చూసే అవకాశం కల్పించనుంది అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ. వీజే ఖన్నా తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో అజయ్ ఘోష్, హరికృష్ణ, జబర్దస్త్ ఎమ్మాన్యుయేల్, ప్రభు, విద్యాసాగర రాజు, రచ్చరవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై టి. గణపతి రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. . చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. కెకె రావు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. వీకెండ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారు అన్వేషిపై ఒక లుక్ వేయవచ్చు.
Telugu film #Anveshi (2023) is now available as RENT on Amazon Prime for Rs.79/- pic.twitter.com/Mgw3Ezh2H6
— OTT Gate (@OTTGate) March 15, 2024
Telugu film #Anveshi (2023) by @v_j_khanna, ft. @VijayDharan_D @SimranG18401460 @AnanyaNagalla & #AjayGhosh, now available for rent on @PrimeVideoIN, starting at ₹79.@chaitanmusic @simonkking @GanapathiReddy_ @durgesh_vt @Ananthkancherla @tseriessouth pic.twitter.com/PqLYfccU3I
— CinemaRare (@CinemaRareIN) March 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.