AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman OTT: ‘హనుమాన్‌’ ఓటీటీ విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ..

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన 'హనుమాన్' చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే సినిమా ఓటీటీ విడుదలపై క్లారిటీ రావడం లేదు. సోషల్ మీడియాలో ఆడియన్స్ ఆశగా పోస్టలు పెడుతూ మూవీ టీమ్‌ను వేడుకుంటున్నారు. దీంతో ఎట్టకేలకు హనమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దీనిపై స్పందించారు.

Hanuman OTT: ‘హనుమాన్‌’ ఓటీటీ విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ..
Hanuman
Ram Naramaneni
|

Updated on: Mar 15, 2024 | 12:23 PM

Share

తేజ సజ్జా కథానాయకుడినా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన ‘హను-మాన్‌’. ఈ సినిమా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. విమర్శల ప్రశంసలు అందుకుంది. నిర్మాతలకు సిరులు కురిపించింది. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఈ సినిమా టీమ్‌కు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కాగా  ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుందా అని మూవీ లవర్స్ యాంగ్జైటీతో ఎదురుచూస్తున్నారు. మూవీ యూనిట్ మాత్రం దీని ఓటీటీ విడుదలపై క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో పోస్ట్ పెట్టారు.

‘‘హనుమాన్‌’ ఓటీటీ రిలీజ్ లేటవుతుంది. కావాలని చేస్తున్నది కాదు. వీలైనంత త్వరగా సినిమాను ఓటీటీలోకి తీసుకురావడానికి మా టీమ్ రెస్ట్ లేకుండా వర్క్ చేసింది. మీకు ది బెస్ట్ ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. మమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్’ అని ప్రశాంత్‌ వర్మ మరో పోస్ట్‌ పెట్టారు. దీనిపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘కనీసం ఎప్పుడొచ్చే అవకాశం ఉందో అయినా తెలపండి’ అని కామెంట్స్‌ పెడుతున్నారు.

మొదట ‘హను-మాన్‌’ మార్చి 2 నుంచి ‘జీ5’లో స్ట్రీమింగ్‌ అవుతుందని విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ అవ్వలేదు. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న వస్తుందని వార్తలు వచ్చాయి. అయినా నిరాశే ఎదురైంది. తాజాగా మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు కనిపించాయి. దీంతో ప్రేక్షకులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.  ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్ట్‌తో మరోసారి నిరాస తప్పలేదు. అయితే తాజాగా ఈ వీకెండ్ మీరు ‘హను-మాన్‌’ వాల్ పేపర్స్‌తో సిద్దంగా ఉండండి అంటూ ప్రశాంత్ కిషోర్ మరో పోస్ట్ పెట్టడంతో.. మూవీ ఈ వారాంతంలో తప్పక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తేజ సజ్జా ఆంజేనేయుడిగా మెప్పించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, అమృత అయ్యర్‌, వెన్నెల కిషోర్‌, సముద్రఖని, వినయ్‌రాయ్‌, గెటప్‌ శ్రీను తదితరులు నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి