- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna All Set For Pan India Release with NBK 109 Movie With Urvashi Rautela
Balakrishna: బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ గురించి చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ
నిన్నగాక మొన్నొచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నపుడు.. బాలయ్య ఎందుకు అటు వైపు చూడట్లేదనే అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. కానీ ప్రతీదానికి ముహూర్తం చూసుకునే బాలయ్య.. పాన్ ఇండియాను మాత్రం వదిలేస్తారా..? ప్రస్తుతం ఈ పని మీదే ఉన్నారు NBK. మరి బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ఎప్పుడు..? దీనికి దర్శకుడెవరు..? బాలయ్యకు మహర్దశ నడుస్తుందిప్పుడు.
Updated on: Mar 15, 2024 | 12:20 PM

నిన్నగాక మొన్నొచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నపుడు.. బాలయ్య ఎందుకు అటు వైపు చూడట్లేదనే అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. కానీ ప్రతీదానికి ముహూర్తం చూసుకునే బాలయ్య.. పాన్ ఇండియాను మాత్రం వదిలేస్తారా..? ప్రస్తుతం ఈ పని మీదే ఉన్నారు NBK.

మరి బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ఎప్పుడు..? దీనికి దర్శకుడెవరు..? బాలయ్యకు మహర్దశ నడుస్తుందిప్పుడు. చిరంజీవి సహా సీనియర్ హీరోలంతా ఒక్క హిట్ కోసం తంటాలు పడుతుంటే.. బాలయ్య మాత్రం అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టేసారు.

ప్రస్తుతం NBK 109తో బిజీగా ఉన్నారు బాలయ్య. బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిపై కూడా అంచనాలు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. వరస విజయాలు వస్తున్నపుడే పాన్ ఇండియన్ సినిమా చేయాలని చూస్తున్నారు బాలయ్య. అయితే దానికింకా టైమ్ ఉందనుకున్నారు ఫ్యాన్స్.

కానీ ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న బాబీ సినిమాతోనే పాన్ ఇండియన్ దండయాత్ర షురూ చేస్తున్నారు NBK. ఊర్వశి రౌతెలా ఇన్‌స్టా పోస్టుతో ఈ విషయం బయటపడింది. మై నెక్ట్స్ పాన్ ఇండియన్ సినిమా NBK 109 అంటూ పోస్ట్ చేసారు ఊర్వశి. NBK 109 పాన్ ఇండియన్ సినిమా అని బాబీ చెప్పకపోయినా.. అది తెరకెక్కుతున్న తీరు చూస్తుంటే విషయం అర్థమైపోతుంది.

ఇందులో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుంటే.. దుల్కర్ సల్మాన్ కీ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరి ఎంట్రీతో హిందీ, మలయాళం మార్కెట్స్ కవర్ చేసారు బాబీ. ఇప్పుడు ఊర్వశి పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ వచ్చింది. చూడాలిక.. NBK పాన్ ఇండియన్ మోత ఎలా ఉండబోతుందో..?




