Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నటించిన మూవీ ట్రైలర్ వచ్చేసింది..
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ‘అన్నామలై’ నటించిన తొలి కన్నడ చిత్రం ‘అరబ్బీ’ ట్రైలర్ విడుదలైంది. చేతులు లేకపోయినా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న కన్నడ వ్యక్తి కెఎస్ విశ్వాస్ జీవితంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ``అరబి` సినిమాలో విశ్వాస్ కోచ్‌గా అన్నామలై నటించారు.
మాజీ ఐపీఎస్ అధికారిగ, ప్రస్తుత తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కాబోయే ప్రధానిగా అభివర్ణిస్తున్న అన్నామలై నటించిన తొలి కన్నడ చిత్రం ‘అరబ్బీ’ ట్రైలర్ విడుదలైంది. ఐపీఎస్ ఆఫీసర్ కెరీర్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత అన్నామలై కన్నడ సినిమాలో నటించారు. సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేసిన ఆయన కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా పాల్గొన్నారు. తాజాగా ఆ సినిమా ట్రైలర్ విడుదలైంది. త్వరలోనే సినిమా విడుదల కానుంది.
రెండు చేతులు లేకపోయినా స్విమ్మింగ్ పోటీలో పాల్గొన్న కేఎస్ విశ్వాస్ జీవితంపై రూపొందుతున్న ‘అరబ్బీ’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విశ్వాస్ తన ఒరిజినల్ పాత్రలో నటించాడు. చేతులు లేకుండా సమాజంలో ఎలాంటి సమస్యలనుఎదుర్కొన్నాడు. వాటన్నింటినీ అధిగమించి ఎలా ముందుకు సాగాడు? అతనికి స్ఫూర్తి ఎవరు? ఎవరు సహాయం చేసారు వంటి అంశాలను ఈ చిత్రం కవర్ చేస్తుంది. ‘అరబ్బీ’ సినిమాలో విశ్వాస్ కోచ్‌గా అన్నామలై నటించారు. అన్నామలై కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కూడా కనిపించారు. అన్నామలై సినిమా కోసం కొన్ని సంభాషణలను కూడా అందించారు. అన్నామలై పరిణితి చెందిన నటుడిలా నటించాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా విద్యుత్ ప్రమాదంలో కెఎస్ విశ్వాస్ రెండు చేతులు కోల్పోయాడు. అయినా పట్టు వదలకుండా అంతర్జాతీయ స్విమ్మర్ స్థాయికి ఎదిగాడు. మంచి డ్యాన్సర్ అయిన విశ్వాస్‌కు జిమ్నాస్టిక్స్ కూడా తెలుసు. చేతులు లేకుండా వంట కూడా చేయగలడు. ఎవరి సహాయం లేకుండా వారి రోజువారీ పనులన్నీ చేస్తాడు. అతని జీవిత కథ ఆధారంగా ‘అరబ్బీ’ చిత్రాన్ని ఆర్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో సిఎస్ చేతన్ నిర్మించారు. అనితా సిద్ధేశ్వర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. కంబాడా చిత్రానికి సంగీతం అందించారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.