Save The Tigers 2 Review: సేవ్ ది టైగర్స్ 2 రివ్యూ.. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయొచ్చు..

తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్‌లు చాలా తక్కువ.. వచ్చినా కూడా విపరీతంగా ఆకట్టుకున్నవి ఇంకా తక్కువ. అందులో ముందు వరసలో వచ్చే వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. తేజ కాకమాను దర్శకత్వంలో మహి వి రాఘవ్ క్రియేట్ చేసిన ఈ షో సూపర్ హిట్ అయింది. తాజాగా సెకండ్ సీజన్ కూడా వచ్చింది. మరి ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

Save The Tigers 2 Review: సేవ్ ది టైగర్స్ 2 రివ్యూ.. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయొచ్చు..
Save The Tigers Season 2
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Mar 15, 2024 | 4:58 PM

వెబ్ సిరిస్ రివ్యూ: సేవ్ ది టైగర్స్ 2

నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, ‘జోర్దార్’ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, సీరత్ కపూర్, దర్శనా బానిక్, సత్య కృష్ణన్ తదితరులు

షో క్రియేటర్స్: మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం

సినిమాటోగ్రఫీ: ఎస్‌పి విశ్వేశ్వర్

సంగీతం: అజయ్ అరసద

దర్శకుడు: అరుణ్ కొత్తపల్లి

తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్‌లు చాలా తక్కువ.. వచ్చినా కూడా విపరీతంగా ఆకట్టుకున్నవి ఇంకా తక్కువ. అందులో ముందు వరసలో వచ్చే వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. తేజ కాకమాను దర్శకత్వంలో మహి వి రాఘవ్ క్రియేట్ చేసిన ఈ షో సూపర్ హిట్ అయింది. తాజాగా సెకండ్ సీజన్ కూడా వచ్చింది. మరి ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

ఫస్ట్ సీజన్ ఎక్కడైతే ముగుస్తుందో అక్కడ్నుంచి రెండో సీజన్ మొదలవుతుంది. హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) కిడ్నాప్‌తో కథ మొదలవుతుంది. ఆమె ఎక్కడ అంటూ పోలీస్ స్టేషన్‌లో విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను ప్రశ్నించడం కాదు.. తమ స్టైల్‌లో పోలీసులు విచారిస్తారు. ఎంత హింసించినా తమకు తెలియదని చెప్తుంటారు ఈ ముగ్గురు. దాంతో హంసలేఖతో పాటు వాళ్ల ముగ్గురు స్టార్ హోటల్ నుంచి బయటికి వెళ్లిన వీడియోను చూపిస్తారు.. ముగ్గురూ కలిసి ఆమెను చంపేశారేమో అని న్యూస్ ఛానళ్లు డౌట్ పెంచేస్తాయి. అదంతా అబద్ధమని, తాము కలిసి పార్టీ చేసుకున్నామని.. హంసలేఖ డైరెక్టుగా వచ్చి చెప్పడంతో వదిలేస్తారు పోలీసులు. పోలీస్ స్టేషన్‌లో చుక్కలు చూసిన విక్రమ్, గంటా రవి, రాహుల్ బయటకు వచ్చాక ఏం జరిగింది..? ఆ ముగ్గురి భార్యల ఏమంటారు..? అసలు వాళ్ల ముగ్గరి వైఫ్స్ వెళ్లి స్పందన (సత్య కృష్ణణ్‌)ను ఎందుకు కలుస్తారు..? ఆమె ఇచ్చిన సలహాల కారణంగా వాళ్ల కాపురాలు ఎలా మారిపోయాయి..? రవికి కార్పొరేటర్ టికెట్ ఇస్తానని ఎమ్మెల్యే ఎందుకు చెప్తాడు..? విక్రమ్ భార్య రేఖ (దేవియాని శర్మ) లాయర్ ప్రాక్టీస్ ఎందుకు ఆపేయాలనుకుంటుంది..? మూడు జంటల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి అనేది అసలు కథ..

కథనం:

సేవ్ ది టైగర్స్ అంతా భర్తలను కాపాడుకుందాం అనే కామెడీ యాంగిల్‌లోనే సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా బాగా తెరకెక్కించారు తేజ. సెకండ్ సీజన్ కూడా అలాగే వెళ్లిపోయాయి. ఈసారి భార్యలకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సిరీస్ చూస్తుంటే క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా గుర్తుకొస్తుంది. అందులో ఉన్న సందేశంతో పాటు వినోదం కూడా అదే స్థాయిలో సేవ్ ది టైగర్స్ 2లో కనిపిస్తుంది. న్యూస్ ఛానెల్స్‌లో వచ్చే గాసిప్స్.. హీరోయిన్స్‌పై వచ్చే వార్తలు.. ఇవన్నీ నిజమే అనుకుంటాం కదా.. దాని చుట్టూనే సేవ్ ది టైగర్స్ 2 కథ అల్లుకున్నారు మేకర్స్. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా ఓ అభిప్రాయానికి రావడం వల్ల జీవితాలు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి వెళుతున్నాయనేది ఈ సిరీస్‌లో బాగా fచూపించారు. సందేశాత్మక కథ అయినా కూడా ఎక్కడా క్లాస్ తీసుకున్నట్లు ఉండదు. చెప్పాల్సిన విషయాన్ని చాలా చక్కటి వినోదంతో చూపించాడు దర్శకుడు అరుణ్. ఈ విషయంలో అతడి రైటింగ్ టీం చాలా బాగా హెల్ప్ చేసారు. మొదటి ఎపిసోడ్ నుంచే ఫన్ మొదలవుతుంది. ఎపిసోడ్స్ పూర్తయ్యే కొద్దీ ఫన్ రేంజ్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా 3,4, 5 ఎపిసోడ్స్ అయితే హిలేరియస్‌గా ఉన్నాయి.

మహి వి రాఘవ్ ఎప్పుడూ ఫన్‌తో పాటు ఎమోషన్‌ను కూడా క్యారీ చేస్తుంటాడు. ఆయన తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్ ఆనందో బ్రహ్మలో కూడా ఇదే ఉంటుంది. యాత్రలోనూ ఇదే ఎమోషన్ కనిపిస్తుంది. ‘సేవ్ ద టైగర్స్ 2’లోనూ అంతర్లీనంగా సందేశం ఉంటుంది కానీ దానికి తగ్గట్లుగానే సమాజంలో జరుగుతున్న ప్రతీ విషయంపై సెటైర్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా రియాలిటీకి దగ్గరగా ఉండే కామెడీ కావడంతో చాలా బాగా కనెక్ట్ అవుతుంది సిరీస్. అక్కడక్కడా కొన్ని సీన్స్ బోర్ కొట్టించినా కూడా.. ఎక్కడా ఫ్లో మాత్రం తగ్గదు. సిరీస్ అంతా కామెడీతో పాటు ఎమోషన్స్ బ్యాలన్స్ చేసుకుంటూనే క్లైమాక్స్‌కు చేరుకుంటుంది కథ. సిరీస్ అంతా కామెడీ భారాన్ని ప్రియదర్శి – సుజాత జంట బాగా మోసింది. ముఖ్యంగా గంటా కారెక్టర్‌కు దర్శి అయితే ప్రాణం పోసాడు. చైతన్యకృష్ణ – దేవియాని శర్మ మధ్య సన్నివేశాలతో రియల్ లైఫ్ జంటలు కూడా బాగానే రిలేట్ అవుతారు. రిలేట్ అవుతాయి. గత సీజన్ స్థాయిలో ఈ సారి మహి వి రాఘవ్ ఈ సిరీస్‌పై ఫోకస్ చేయకపోయినా.. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం మాత్రం బాగుంది. ఫస్ట్ సీజన్ రేంజ్ కాకపోయినా.. హాయిగా ఇంట్లో కూర్చుని సేవ్ ది టైగర్స్ 2 కూడా ఎంజాయ్ చేయొచ్చు.

నటీనటులు:

ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ.. ముగ్గురూ ముగ్గురే. మరీ ముఖ్యంగా దర్శి అయితే అద్భుతం అంతే. మనోడు మాట్లాడే ప్రతీ మాటా నవ్వొస్తుంది. తెలంగాణ యాసలో దర్శి డైలాగ్స్ అదిరిపోయాయి. సుజాత కూడా అంతే బాగా నటించింది. అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మరవైపు రాహుల్ పాత్రలో చైతన్యకృష్ణ సెటిల్డ్‌గా నటించాడు. దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి తమ పాత్రలకు న్యాయం చేసారు. ఈ సారి కొత్తగా యాడ్ అయిన సీరత్ కపూర్, దర్శనా బానిక్ బాగున్నారు.. బాగా నటించారు.. సిరీస్‌కు గ్లామర్ పంచారు.

టెక్నికల్ టీం:

సేవ్ ది టైగర్స్ 2కు ప్రధాన బలం టెక్నీషియన్స్. సంగీతం చక్కగా ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ అదిరిపోయింది. ఎడిటింగ్ అక్కడక్కడా కాస్త వీక్ అనిపించింది కానీ డైరెక్టర్ చాయిస్ కాబట్టి ఏమనలేం. ఇక సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. అందర్నీ చాలా బాగా చూపించాడు సినిమాటోగ్రఫర్ విశ్వేశ్వర్. దర్శకుడు అరుణ్ కొత్తపల్లి తన బాధ్యతను చాలా బాగా నిర్వర్తించాడు. క్రియేటర్స్‌గా మహి, ప్రదీప్ అద్వైతం తమ రోల్స్‌కు న్యాయం చేసారు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ‘సేవ్ ద టైగర్స్ 2’… నవ్విస్తుంది.. ఆలోచింపచేస్తుంది.. ఆకట్టుకుంటుంది.. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయొచ్చు..