IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు భారీ షాక్.. విదేశాల్లో రెండో దశ ఐపీఎల్ మ్యాచ్‌లు! ఈసారి ఎక్కడంటే?

క్రికెట్ ఫ్యాన్స్‌కు భారీ షాక్‌. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్ రెండో దశ మ్యాచ్ లు విదేశాల్లో జరగనున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి.

IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు భారీ షాక్.. విదేశాల్లో రెండో దశ ఐపీఎల్ మ్యాచ్‌లు! ఈసారి ఎక్కడంటే?
Ipl 2024
Follow us
Basha Shek

|

Updated on: Mar 16, 2024 | 10:41 AM

క్రికెట్ ఫ్యాన్స్‌కు భారీ షాక్‌. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్ రెండో దశ మ్యాచ్ లు విదేశాల్లో జరగనున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. గతంలో లాగే ఈసారి కూడా యూఏఈలో ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ మ్యాచ్ లు నిర్వహించేలా అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారట బీసీసీఐ అధికారులు. ఇదిలా ఉంటే గతంలో 2009, 2014లో విదేశాల్లోనే ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. అలాగే, కరోనా భయం నేపథ్యంలో ఐపిఎల్ 2021 యుఏఈలో జరిగింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ టోర్నీని విదేశాలకు తరలించాల్సిన అవసరం ఏర్పడింది. ఐపీఎల్ 2024 లో భాగంగా ఇప్పటికే 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది బీసీసీఐ. మార్చి 22 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా ఏప్రిల్ 7 వరకు భారత్‌లోనే ఐపీఎల్ మ్యాచ్ జరగనున్నాయని, ఆ తర్వాత మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై బీసీసీఐ అధికారులు యూఏఈ క్రికెట్ బోర్డుతో చర్చించారని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని నివేదికలు చెబుతున్నాయి.  శనివారం లోక్‌సభ ఎన్నికల తేదీని ప్రకటిస్తామని, ఆ తర్వాత ఎన్నికల తేదీ, ఐపీఎల్ షెడ్యూల్‌ను పరిశీలించిన తర్వాత టోర్నీని విదేశాలకు తరలించాలా వద్దా అనే అంశంపై ఐపీఎల్ పాలకమండలి తుది నిర్ణయం తీసుకోనుంది.

ఐపీఎల్ షిఫ్ట్ ఎందుకంటే?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ప్రకటిస్తే ప్రభుత్వం ఐపీఎల్‌కు పూర్తి భద్రత కల్పించలేదు. ఇంతకుముందు 2009, 2014లో ఇలాంటి కారణాలతో ఐపీఎల్‌ను విదేశాలకు తరలించారు. ఇప్పుడు మళ్లీ విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించాల్సిన అవసరం బీసీసీఐకి ఎదురైంది. 2014లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దుబాయ్‌లో 20 ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించారు. అంతకుముందు, 2009 సాధారణ ఎన్నికల నేపథ్యంలో మొత్తం టోర్నీని దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఇప్పుడు మూడో ఎన్నికల కారణంగా ఐపీఎల్‌లోని కొన్ని మ్యాచ్‌లు విదేశాలకు తరలిపోయే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..