WPL 2024: నువ్వా.. నేనా? మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ కోసం ఢిల్లీ, బెంగళూరు బిగ్ ఫైట్.. ఫైనల్ ఎప్పుడు, ఎక్కడంటే?
Delhi Capitals Women vs Royal Challengers Bangalore Women, Final: మహిళల ప్రీమియర్ లీగ్ 2024 చివరి దశకు చేరుకుంది. ఈసారి WPL ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
Delhi Capitals Women vs Royal Challengers Bangalore Women, Final: మహిళల ప్రీమియర్ లీగ్ 2024 చివరి దశకు చేరుకుంది. ఈసారి WPL ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. శుక్రవారం (మార్చి 15) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను బెంగళూరు 5 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు దూరమైన స్మృతి మంధాన టీమ్ ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసి టాప్-3లో నిలిచి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఇక ఫైనల్ ఢిల్లీని సైతం ఓడించి టైటిల్ ను కైవసం చేసుకోవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు WPL 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 17) జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. WPL 2024 ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం JioCinema యాప్‌లో అందుబాటులో ఉంటుంది. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో కూడా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు WPL 2024 ఫైనల్ ఆదివారం సాయంత్రం 7:30 PM ISTకి ప్రారంభమవుతుంది.
ఫైనల్ లో ఢిల్లీ, బెంగళూరు..
FINAL BERTH ✅@RCBTweets join the @DelhiCapitals for a shot at the ultimate prize 🏆#TATAWPL | #MIvRCB | #Eliminator pic.twitter.com/R0YL3bE9EP
— Women’s Premier League (WPL) (@wplt20) March 15, 2024
రెండు జట్లు (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్:
మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్జ్, ఎలిస్ క్యాప్సీ, మరిజానే కప్, జెస్ జోనాసెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా, శిఖా పాండే, మిన్ను మణి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ మోలినెక్స్, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జార్జియా వేర్‌హామ్, దిశా కాస్ట్, రాంకా పాటిల్, ఆశా , శ్రద్ధా పోఖార్కర్, రేణుకా సింగ్.
బెంగళూరు విజయ దరహాసం..
𝗠𝗮𝗶𝗱𝗲𝗻 #𝗧𝗔𝗧𝗔𝗪𝗣𝗟 𝗙𝗶𝗻𝗮𝗹 𝗳𝗼𝗿 𝗥𝗖𝗕 👏@RCBTweets secure a 5-run win over #MI in an edge of the seat thriller in Delhi 📍🤝
They will now play @DelhiCapitals on 17th March! ⌛️
Scorecard ▶️https://t.co/QzNEzVGRhA#MIvRCB | #Eliminator pic.twitter.com/0t2hZeGXNj
— Women’s Premier League (WPL) (@wplt20) March 15, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..