AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2024: మరోసారి ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన ఎల్లీస్ పెర్రీ.. ముంబైను ఓడించి WPL ఫైనల్‌కు బెంగళూరు

ఆలస్యమైనా ఆర్సీబీ అదరగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటి ఏకంగా ఫైనల్ కు దూసుకెళ్లింది. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో స్మృతి మంధాన నేతృత్వంలోని..

WPL 2024: మరోసారి ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన ఎల్లీస్ పెర్రీ.. ముంబైను ఓడించి WPL ఫైనల్‌కు బెంగళూరు
Royal Challengers Bangalore
Basha Shek
|

Updated on: Mar 16, 2024 | 6:49 AM

Share

ఆలస్యమైనా ఆర్సీబీ అదరగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటి ఏకంగా ఫైనల్ కు దూసుకెళ్లింది. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. తద్వారా మహిళల ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ ఫైనల్ కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం బెంగళూరు ఢిల్లీతో తలపడనుంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచి ఢిల్లీ జట్టు ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇదిలా ఉంటే తాజా పరాజయంతో వరుసగా రెండోసారి ట్రోఫీని చేజిక్కించుకోవాలన్నముంబై ఇండియన్స్ జట్టు కల చెదిరిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టుకు శుభారంభం లభించలేదు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఉండగా.. ఓపెనర్ సోఫీ డివైన్ రూపంలో తొలి వికెట్ పడింది. డిసైడర్‌లో సోఫీ డివైన్ మంచి ప్రదర్శన చేస్తుందని భావించారు. కానీ 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. దీని తర్వాత కెప్టెన్ స్మృతి మంధాన కూడా అదే స్కోరు వద్ద 10 పరుగులు చేసి వికెట్ ను సమర్పించుకుంది. మంధాన ఔటైన తర్వాత వచ్చిన దిశా కస్సట్ ఖాతా తెరవలేక పెవిలియన్ చేరింది. దీంతో బెంగళూరు 23 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తర్వాత వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిచా ఘోష్‌ (19 బంతుల్లో 14 పరుగులు)ను హేలీ మాథ్యూస్ అవుట్ చేసింది. రిచా అవుట్ అయిన తర్వాత, RCB వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే ఒక ఎండ్‌లో ఎల్లీస్ పెర్రీ 50 బంతుల్లో 66 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఇన్నింగ్స్ కారణంగా బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలింగ్‌లో హేలీ మాథ్యూస్, నేట్ సివర్-బ్రంట్, సైకా ఇషాక్ తలో 2 వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి

చతికిల పడిన ముంబై..

20 ఓవర్లలో 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు కూడా శుభారంభం లభించలేదు. జట్టు 27 పరుగుల వద్ద ఫామ్‌లో ఉన్న బ్యాటర్ హేలీ మాథ్యూస్ కీలక వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత స్కోరు 50కి చేరువలో ఉన్న సమయంలో రెండో ఓపెనర్ యాస్తిక భాటియా కూడా పెవిలియన్ చేరింది. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసింది. అయితే 18వ ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరింది. కౌర్ ఔటైన తర్వాత ముంబై ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. దీంతో ఆ జట్టు 12 బంతుల్లో 15 పరుగులు చేయలేక 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. బెంగళూరు తరఫున రాంకా పాటిల్ 2 వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన ఎలిస్ పెర్రీ 1 వికెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. జార్జియా వేర్‌హామ్ కూడా ఒక వికెట్ తీసింది

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..