Pawan Kalan-OG: ‘కత్తి పట్టుకున్న కత్తిలా ఉన్నాడు.. ఓజీ నుంచి పవన్ పవర్ ఫుల్ పోస్టర్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటస్తోన్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓజీ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌). సాహోతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ, సీరియల్ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Pawan Kalan-OG: 'కత్తి పట్టుకున్న కత్తిలా ఉన్నాడు.. ఓజీ నుంచి పవన్ పవర్ ఫుల్ పోస్టర్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Mar 16, 2024 | 2:36 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటస్తోన్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓజీ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌). సాహోతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ, సీరియల్ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జపాన్, ముంబై నగరాల్లో ని గ్యాంగస్టర్స్ కథాంశంతో ఎంతో స్టైలిష్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, పవన్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఇది వరకే మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం పవన్ ఎన్నికల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ కాస్త బ్రేక్ పడింది. దీంతో ఫ్యాన్స్ కాస్తా నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా ఓజీ నుంచి ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్‌.

ఓజీ సినిమాకు స్వరాలు సమకూరుస్తోన్న సంగీత దర్శకుడు తమన్ పవన్ కల్యాణ్‌ నయా పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్టర్ లో కత్తి పట్టుకుని ప్రత్యర్థులను తెగనరుకుతూ బట్టల నిండా రక్తంతో కనిపించాడు పవన్. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రకాశ్‌ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్