AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder Mubarak OTT: ఓటీటీలోకి వచ్చేసిన సారా, కరిష్మాల క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు.. ఎక్కడంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సారా అలీ ఖాన్ ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిబిజీగా ఉంటోంది. ఇప్పుడామె నటించిన మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డైరెక్టర్ హోమీ అదజానియా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మర్డర్ ముబారక్. ఇందులో సారాతో పాటు సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠి, డింపుల్ కపాడియా..

Murder Mubarak OTT: ఓటీటీలోకి వచ్చేసిన సారా, కరిష్మాల క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు.. ఎక్కడంటే?
Murder Mubarak Movie
Basha Shek
|

Updated on: Mar 16, 2024 | 1:45 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సారా అలీ ఖాన్ ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిబిజీగా ఉంటోంది. ఇప్పుడామె నటించిన మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డైరెక్టర్ హోమీ అదజానియా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మర్డర్ ముబారక్. ఇందులో సారాతో పాటు సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠి, డింపుల్ కపాడియా, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, సుహైల్ నయ్యర్, తారా అలీషా బెర్నీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్‌లోనే ఆసక్తిని రేకెత్తించిన మర్డర్ ముబారక్ డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజైంది. శుక్రవారం (మార్చి 15) అర్ధరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ మర్డర్ ముబారక్ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

మర్డర్ మిస్టరీగా..

అనుజా చౌహాన్ రాసిన క్లబ్ యూ టు డెత్ నవల ఆధారంగా మర్డర్ ముబారక్ సినిమాను తెరకెక్కించారు. డోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ ఈ సినిమాను నిర్మించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ధనవంతులు మెంబర్స్ గా ఉండే ఉండే ది రాయల్ ఢిల్లీ క్లబ్‌లో అనుకోకుండా ఓ హత్య జరుగుతుంది. ఈ హత్య వెనుక ఉన్న కారణాలను, మర్డర్ ఎవరు చేశారు అనే మిస్టరీ ఛేదించేందుకు భవానీ సింగ్ (పంకజ్ త్రిపాఠి) రంగంలోకి దిగుతాడు. మరి అతను ఈ కేసును ఎలా పరిష్కరించాడు. ఈ మర్డర్ మిస్టరీ వెనక ఎవరి హస్తం దాగుంది? అనేది తెలుసుకోవాలంటే మర్డర్ ముబారక్ సినిమా చూడాల్సిందే. క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ మూవీ ఒక మంచి ఆప్షన్.

ఇవి కూడా చదవండి

డైరెక్టుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన మర్డర్ ముబారక్..

అందుబాటులో తెలుగు వెర్షన్ కూడా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి