AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాలు.. టాప్-10 లిస్ట్ ఇదిగో.. అసలు మిస్‌ అవ్వొద్దు!

పలు తెలుగు సినిమాలతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లిష్, తమిళ్, మలయాళం, కొరియన్, స్పానిష్.. ఇలా అన్ని భాషల సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లో ఉన్నాయి. వీటితో పాటు తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ ఉన్న సినిమాలను ప్రతి వారం విడుదలవుతుంటుంది. అలా ఈ వారం కూడా టాప్ ట్రెండింగ్ లిస్ట్ వచ్చేసింది.

OTT Movies: ఈ వారం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాలు.. టాప్-10 లిస్ట్ ఇదిగో.. అసలు మిస్‌ అవ్వొద్దు!
OTT Movies
Basha Shek
|

Updated on: Mar 17, 2024 | 4:29 PM

Share

ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ లోనే దిగ్గజ సంస్థగా నెట్‌ఫ్లిక్స్ కు మంచి గుర్తింపు ఉంది. తమ యూజర్ల అభిరుచులకు తగ్గట్టుగా ప్రతి వారం సరికొత్త సినిమాలు, సిరీస్ లను అందుబాటులోకి తెస్తుంటుంది. అలా ఈ వారం కూడా సరికొత్త కంటెంట్ తో అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరిస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది.ఇందులో పలు తెలుగు సినిమాలతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లిష్, తమిళ్, మలయాళం, కొరియన్, స్పానిష్.. ఇలా అన్ని భాషల సినిమాలు, సిరీస్ లున్నాయి. వీటితో పాటు తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ ఉన్న సినిమాలను ప్రతి వారం విడుదల చేస్తుంది. అలా ఈ వారం కూడా లిస్ట్ వచ్చేసింది. మరి నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమాలేంటో తెలుసుకుందాం రండి.

1. మర్డర్ ముబారక్

సారా అలీ ఖాన్, పంకజ్ త్రిపాఠి, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, విజయ్ వర్మ, డింపుల్ కపాడియా తదితర స్టార్ నటీనటులు నటించిన క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ ముబారక్. అదజానియా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 15 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం టాప్-1 ట్రెండింగ్ లో ఉందీ సినిమా. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

2. డామ్‌సెల్

ఫాంటసీ అడ్వెంచర్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో 2 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళ తదితర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

3. అన్వేషిప్పిన్ కండేతుమ్

మలయాళం హీరో టొవినో థామస్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా మార్చి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో మూడో ప్లేస్ లో ఉంది.

4. మెర్రీ క్రిస్మస్

విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ జంటగా నటించిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లో నాలుగో ప్లేస్ లో కొనసాగుతోంది. తెలుగులోనూ చూడొచ్చు. 5. తుండు

రణం, ఖతర్నాక్ సినిమాలతో తెలుగు వారికి బాగా సుపరిచితమైన బిజూ మీనన్ నటించిన సినిమా తుండు. దసరా విలన్ షైన్ టామ్ చాకో మరో కీలక పాత్ర పోషించాడు. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవే కాకుండా బ్లాక్ అడమ్, డంకీ, యానిమల్, ఆర్ట్ ఆఫ్ లవ్, ఐరిష్ విష్ సినిమాలు తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us