Allu Arjun: ఆంధ్రాలో మల్టీప్లెక్స్‌కు ప్లాన్ చేస్తోన్న అల్లు అర్జున్‌.. ఏ సిటీలోనంటే?

అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లను రన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కు AAA, మహేశ్ బాబుకు AMB, అలాగే విజయ్ దేవరకొండకు VD పేరుతో హైదరాబాద్ నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. త్వరలోనే మాస్ మహరాజా ర‌వితేజ కూడా..

Allu Arjun: ఆంధ్రాలో మల్టీప్లెక్స్‌కు ప్లాన్ చేస్తోన్న అల్లు అర్జున్‌.. ఏ సిటీలోనంటే?
Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Mar 18, 2024 | 8:25 PM

టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు సినిమాలతో పాటు బిజినెస్ లోనూ అదరగొడుతున్నారు. రకరకాల వ్యాపారాల్లో కోట్ల ఆర్జిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్ బిజినెస్ బాగా ఊపందుకుంది. స్టార్ హీరోలు సైతం ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లను రన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కు AAA, మహేశ్ బాబుకు AMB, అలాగే విజయ్ దేవరకొండ కు VD పేరుతో హైదరాబాద్ నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. త్వరలోనే మాస్ మహరాజా ర‌వితేజ కూడా మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నారు. ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో AAA పేరుతో మల్లీప్లెక్స్ థియేటర్ నిర్వహిస్తోన్న అల్లు అర్జున్ ఇప్పుడు తన బిజినెస్ ను మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నాడట. అయితే ఇప్పుడు తెలంగాణ‌లో కాదు ఏపీలో. అవును విశాఖ పట్నంలో అర్జున్ AAA మల్టీప్లెక్స్ కు ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం వైజాగ్‌లో కొత్తగా కడుతున్న ఇనార్బిట్ మాల్‌లో ఆసియన్ సంస్థతో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటుచేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజిబిజీగా ఉంటున్నాడు అర్లు అర్జున్. గతంలో రిలీజై పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప 1 సినిమాకు మించి క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. . ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప2 సినిమా రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

పుష్ప 2 షూటింగ్ లో అల్లు  అర్జున్.. వీడియోలు ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!