Article 370 OTT: ఓటీటీలో యామీ గౌతమ్ కాంట్రవర్సీ మూవీ.. ‘ఆర్టికల్ 370’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైన ఆర్టికల్ 370 సూపర్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాదిలో హిందీ చిత్ర పరిశ్రమలో వంద కోట్లు రాబట్టిన సినిమాల్లో ఆర్టికల్ 370 కూడా ఒకటి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్

Article 370 OTT: ఓటీటీలో యామీ గౌతమ్ కాంట్రవర్సీ మూవీ.. 'ఆర్టికల్ 370' స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Article 370 Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 18, 2024 | 7:50 PM

బాలీవుడ్ ప్రముఖ నటి, ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ఆర్టికల్ 370. జమ్మూకశ్మీర్‌లో కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370, ఆ తర్వాత జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆదిత్య సుహాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దక్షిణాది ప్రముఖ నటి ప్రియమణి మరో కీలక పాత్రలో మెరిసింది. ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైన ఆర్టికల్ 370 సూపర్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాదిలో హిందీ చిత్ర పరిశ్రమలో వంద కోట్లు రాబట్టిన సినిమాల్లో ఆర్టికల్ 370 కూడా ఒకటి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమా ఆర్టికల్ 370 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జియో సినిమాలో ఆర్టికల్ 370 సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజైంది. అయితే ఓటీటీ కాబట్టి హిందీతో పాటు తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి రావొచ్చు.

బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్‌పై లోకేష్ ధర్, ఆదిత్య ధర్,జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఆర్టికల్ 370 సినిమాలో రాజ్ అరుణ్, శివమ్ ఖజూరియా, అరుణ్ గోవిల్, వైభవ్ తాత్వాడి, దివ్యా సేత్, సుమిత్ కౌల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే గల్ఫ్‌ దేశాలన్నీ ఆర్టికల్ 370 సినిమాపై నిషేధం విధించాయి. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ ఈ సినిమాను ప్రదర్శించకుండా ఆదేశాలు జారీ చేశాయి. అదే సమయంలో మన దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆర్టికల్ 370 సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

వంద కోట్ల క్లబ్ లో ఆర్టికల్ 370

రాజ్ నాథ్ సింగ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.