IPL 2024: అన్నొచ్చిండు.. ఆర్సీబీతో చేరిన విరాట్ కోహ్లీ.. గ్రాండ్ వెల్‌కమ్ పలికిన టీమ్ మెంబర్స్.. వీడియో
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన CSK ఎప్పటిలాగే లీగ్ టోర్నీ ప్రారంభానికి నెలరోజుల ముందే తమ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించింది. ధోనీ తో సహా జట్టులోని ఆటగాళ్లంతా శిబిరంలో పాల్గొన్నారు. RCB కూడా గత వారం నుండి తన ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ శిబిరంలో విదేశీ క్రీడాకారులతో సహా స్వదేశీ క్రీడాకారులు కూడా పాల్గొన్నారు
IPL 17వ ఎడిషన్ ప్రారంభానికి కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి . లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. దీంతో ఇరు జట్ల నుంచి తొలి మ్యాచ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. నిజానికి, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన CSK ఎప్పటిలాగే లీగ్ టోర్నీ ప్రారంభానికి నెలరోజుల ముందే తమ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించింది. ధోనీ తో సహా జట్టులోని ఆటగాళ్లంతా శిబిరంలో పాల్గొన్నారు. RCB కూడా గత వారం నుండి తన ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ శిబిరంలో విదేశీ క్రీడాకారులతో సహా స్వదేశీ క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. కానీ జట్టుకు మూలస్తంభమైన విరాట్ కోహ్లీ మాత్రం జట్టుతో చేరేలేదు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ కాస్తా కంగారు పడ్డారు. అయితే ఎట్టకేలకు కోహ్లీ వచ్చేశాడు. ఐపీఎల్ సమీపిస్తున్న తరుణంలో విరాట్ కోహ్లి ఆర్సీబీ క్యాంప్‌లో చేరాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే RCB ఫ్రాంచైజీ ప్రతిసారీ చిన్నస్వామి స్టేడియంలో అన్‌బాక్సింగ్ ఈవెంట్‌ను నిర్వహించింది. మంగళవారం (మార్చి 19న) జరిగే ఈ ఈవెంట్ కు ముందే కోహ్లి ఆర్‌సీబీ క్యాంపులో చేరతాడని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ప్రోగ్రామ్ ప్రారంభానికి 2 రోజుల ముందు లండన్ నుంచి భారత్ కు వచ్చిన కోహ్లి.. ఇప్పుడు బెంగళూరులోని ఆర్సీబీ జట్టులో చేరాడు.
కోహ్లీ రాకకు సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తొలిసారిగా ఆర్‌సీబీ జిమ్ సెంటర్‌ను సందర్శించిన కోహ్లి.. జట్టులో చేరినందుకు సంతోషంగా ఉందన్నాడు. జట్టులోకి వచ్చిన కోహ్లి మంగళవారం ఆటగాళ్లతో కలిసి శిక్షణ ప్రారంభించనున్నాడు. ఆ తర్వాత అన్‌బాక్స్ ప్రోగ్రామ్‌లో టీమ్‌తో కలిసి కనిపించనున్నారు. ఈ కార్యక్రమం ముఖ్యాంశం ఏమిటంటే, RCB తన పేరును మార్చుకుంది. అంతేకాదు ఈసారి జట్టు జెర్సీ కూడా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజమైతే, ఈ ఈవెంట్‌లో జట్టు కొత్త జెర్సీని లాంచ్ చేస్తారు. అంతేకాదు నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఆర్‌సిబి మహిళల జట్టు తొలిసారి డబ్ల్యుపిఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. తద్వారా రేపటి కార్యక్రమంలో మహిళా జట్టు తొలి ట్రోఫీతో సందడి చేయనుంది.
బెంగళూరు టీమ్ తో చేరిన కోహ్లీ.. వీడియో
It’s time for the arrival video you were waiting for! ❤️👑
Virat Kohli returns to his den in Namma Bengaluru, ahead of the #IPL.
Watch what he has to say on @bigbasket_com presents Bold Diaries! Download the Big Basket App now. 📱#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #Homecoming… pic.twitter.com/t3MPYtORAF
— Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024
స్టైలిష్ లుక్ లో కోహ్లీ..
Daddy’s Home and he is ready to reign again! 👑
Virat Kohli checked in to Namma Bengaluru, and we can’t keep calm. Happy #Homecoming, @imVkohli! ❤🔥🏡#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/KLWKz788wx
— Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..