Siddharth: ఒక్క మహిళా రోడ్డుపై లేదెందుకో! ఆర్సీబీ విజయంపై సిద్ధార్థ్ కాంట్రవర్సీ ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం
మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 17) రాత్రి జరిగింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది . ఆర్సీబీ మహిళలు కప్ ఎత్తగానే బెంగళూరు వీధుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అలాగే సోషల్ మీడియా వేదికగానూ స్మృతి మందన్నా టీమ్ కు విషెస్ వెల్లువెత్తాయి.

‘ఈసారి కప్ మాదే’ అంటూ ఆర్సీబీ అభిమానులు ఎన్నో ఏళ్లుగా కంటున్న కల ఎట్టకేలకు సాకారమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 17) రాత్రి జరిగింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది . ఆర్సీబీ మహిళలు కప్ ఎత్తగానే బెంగళూరు వీధుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అలాగే సోషల్ మీడియా వేదికగానూ స్మృతి మందన్నా టీమ్ కు విషెస్ వెల్లువెత్తాయి. ఈ మేరకు నటుడు సిద్ధార్థ్ కూడా ట్వీట్ చేశారు. అయితే అతను ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశాడో తెలియదు కానీ అది కాస్తా వివాదాస్పదంగా మారింది. పలువురు నెటిజన్లు సిద్ధూను తప్పుపట్టారు. బెంగళూరు వీధుల్లో ‘ఆర్‌సిబి’ జట్టు విజయాన్ని సంబరాలు చేసుకుంటున్న పురుషుల వీడియోను సిద్ధార్థ్ షేర్ చేశాడు. అలాగే ‘ఒక టోర్నమెంట్‌లో మహిళల జట్టు ట్రోఫీని గెలుచుకుంది. కానీ రోడ్డుపై సంబరాలు చేసుకునేందుకు ఒక్క మహిళ కూడా లేదు. భారతదేశ పితృస్వామ్య వ్యవస్థకు ఇది సరైన ఉదాహరణ’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు సిద్ధార్థ్. ఇది అభిమానులు, నెటిజన్లకు అసలు అంతు పట్టలేదు. అసలు నీ ఉద్దేశమేంటి? మహిళల విషయాన్ని మగవాళ్లు సెలబ్రేట్ చేసుకోకూడదా? అంటూ సిద్దూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో తన మొదటి ట్వీట్ పై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేశాడు సిద్ధార్థ్.. ‘పైన ఉన్న ట్వీట్ పై పూర్తి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. భారత దేశంలోని పబ్లిక్ ప్లేస్ లలో మహిళలు స్వేచ్ఛగా తిరగలేరన్నది నా ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా రాత్రి, అర్ధరాత్రి సమయాల్లో. ఓ మహిళల జట్టు గెలిచిన సందర్భంలోనూ పురుషుల్లాగే మహిళలు కూడా వీధుల్లో సంబరాలు చేసుకోలేకపోతున్నారే అనే నేను చెప్పాలనుకున్నాను’ అని వివరణ ఇచ్చాడు. దీని తర్వాత కూడా నెటిజన్లు శాంతించలేదు. సిద్ధార్థ్ ను ట్రోల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు.
కాగా సిద్ధార్థ్ బహుభాషా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. సమాజంలో జరుగుతున్న పలు సంఘటనలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటాడు. అతను తన మనసులోని మాటను చెప్పడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అందుకే అప్పుడప్పుడు వివాదాలు కొని తెచ్చుకుంటాడు. 2023లో సిద్ధార్థ్ నటించిన ‘చిట్టా’ (తెలుగులో చిన్నా) సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
సిద్ధార్థ్ ట్వీట్..
To clarify, the above tweet is about how public spaces in India are inaccessible for women, especially during the night time. The intent was to point out the irony in the inability of women to celebrate like men on the streets, even for an iconic instance of women’s achievement.
— Siddharth (@DearthOfSid) March 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








