AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rajinikanth: అతనితో ప్రేమలోపడిన రజినీకాంత్ కూతురు.. షాక్ అవుతున్న నెటిజన్స్

ఆమె దర్శకత్వంలో వచ్చిన త్రీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాకు ఫాన్స్ ఉన్నారు. రీసెంట్ గా లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐశ్వర్య రజినీకాంత్. ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది.

Aishwarya Rajinikanth: అతనితో ప్రేమలోపడిన రజినీకాంత్ కూతురు.. షాక్ అవుతున్న నెటిజన్స్
Aishwarya Rajinikanth
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2024 | 10:03 AM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. ఆమె దర్శకత్వంలో వచ్చిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాయి. ఆమె దర్శకత్వంలో వచ్చిన త్రీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాకు ఫాన్స్ ఉన్నారు. రీసెంట్ గా లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐశ్వర్య రజినీకాంత్. ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే ఐశ్వర్య రజినీకాంత్ స్టార్ హీరో ధనుష్ సతీమణి అందరికి తెలుసు. అయితే ఈ జంట మొన్నామధ్య విడిపోయారు. దాదాపు 18 ఏళ్ల వివాహబంధానికి వీరు స్వస్తి చెప్పారు. విడాకుల తర్వాత ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ విడిగా ఉంటున్నారు.

ధనుష్ హీరోగా బిజీగా ఉండగా.. ఐశ్వర్య తన సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ జంటకు ఇద్దరూ కొడుకులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఐశ్వర్య రజినీకాంత్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దాని పై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇటీవల ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ధనుష్ హీరోగా ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన త్రీ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించిన విషయం తెలిసిందే..

అనిరుధ్ గురించి ఐశ్వర్య రజినీకాంత్ మాట్లాడుతూ.. త్రీ సినిమాకు అనిరుధ్ ను ధనుష్ పరిచయం చేశాడు. ఆ సినిమా చేస్తున్నప్పుడు అతని వయసు 20 ఏళ్లు.. ఇప్పుడు అనిరుధ్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారిపోయాడు. అనిరుధ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి తన మాజీ భర్త( ధనుష్) కారణం అని తెలిపింది ఐశ్వర్య రజినీకాంత్. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాతో పాటు కోలీవుడ్ లో వైరల్ గా మారాయి. దాంతో ధనుష్ తో మరోసారి ఐశ్వర్య ప్రేమలో పడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ ఇద్దరూ మళ్లీ కలిసిపోవాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. మరి ఈ జంట తిరిగి కలుస్తారేమో చూడాలి.

ఐశ్వర్య రజినీకాంత్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!