AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: శివాజీకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్‌.. ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం

బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ తన మాట నిలబెట్టుకున్నాడు. టైటిల్ ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతు కుటుంబాలకే అందజేస్తానంటూ ప్రకటించిన రైతు బిడ్డ ఇటీవలే ఆ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా ఓ పేద కుటుంబానికి లక్ష రూపాయలతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని పంచాడు పల్లవి ప్రశాంత్

Pallavi Prashanth: శివాజీకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్‌.. ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
Pallavi Prashanth, Sivaji
Basha Shek
|

Updated on: Mar 19, 2024 | 8:00 PM

Share

బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ తన మాట నిలబెట్టుకున్నాడు. టైటిల్ ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతు కుటుంబాలకే అందజేస్తానంటూ ప్రకటించిన రైతు బిడ్డ ఇటీవలే ఆ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా ఓ పేద కుటుంబానికి లక్ష రూపాయలతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని పంచాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ హౌస్ లోనూ, ఆ తర్వాత కూడా రైతు బిడ్డకు అండగా నిలుస్తోన్న హీరో శివాజీ, సందీప్ మాస్టర్, భోలే షా వలి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఇదే కార్యక్రమం సందర్భంగా శివాజీకి ఓ బహుమతి ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ శివాజీకి పల్లవి ప్రశాంత్ గిఫ్ట్ గా ఏమిచ్చాడో తెలుసా? ఒక బ్రూ కాఫీ డబ్బా.

ఇవి కూడా చదవండి

మరి పల్లవి ప్రశాంత్ శివాజీకి కాఫీ డబ్బా ఎందుకిచ్చాడనేగా మీ డౌట్. బిగ్ బాస్ షో రెగ్యులర్ గా చూసే వాళ్లకి ఇది అర్థమవుతుంది. ఇదే కాఫీ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో పెద్ద యుద్ధమే జరిగింది. కాఫీ పొడి పంపించకపోతే హౌజ్ నుంచే బయటకు పోతానంటూ ఏకంగా బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చాడు శివాజీ. దీంతో శివాజీ హౌజ్ లో ఉన్నన్ని రోజులూ కాఫీ పొడి డబ్బాలు పంపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఇదే కాఫీ పొడి విషయమై శోభా శెట్టి, శివాజీల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇప్పుడీ సంఘటనలకు గుర్తుగానే సరదాగా ఇలా కాఫీ పొడి డబ్బాను గిఫ్ట్ గా ఇచ్చాడు పల్లవి ప్రశాంత్

కాఫీ పౌడర్ కథేంటంటే..

పల్లవి ప్రశాంత్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 ఇచ్చిన మాట తప్ప కుండా పేద కుటుంబానికి సాయం చేస్తోన్న పల్లవి ప్రశాంత్, వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌
పందెం కోళ్లలా పోటీకి సై అంటున్న స్టార్ హీరోలు
పందెం కోళ్లలా పోటీకి సై అంటున్న స్టార్ హీరోలు
మారిన మేడారం ముఖచిత్రం! తిరుపతి, కుంభమేళ తరహాలో మేడారం అభివృద్ధి
మారిన మేడారం ముఖచిత్రం! తిరుపతి, కుంభమేళ తరహాలో మేడారం అభివృద్ధి
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. April నెల దర్శన కోటా విడుదల
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. April నెల దర్శన కోటా విడుదల