Fighter OTT: అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి హృతిక్ రోషన్ ‘ఫైటర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గణతంత్ర దినోత్సవం కానుకగా ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో రిలీజైన ఫైటర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మొత్తమ్మీద హృతిక్ రోషన్ రూ. 350 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ఫైటర్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా?అని చాలా మంది నిరీక్షిస్తున్నారు.

Fighter OTT: అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి హృతిక్ రోషన్ 'ఫైటర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Fighter Movie
Follow us

|

Updated on: Mar 20, 2024 | 9:52 PM

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, అందాల తార దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ కాన్సెప్ట్ మూవీలో అనిల్ కపూర్, బిపాసా భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గణతంత్ర దినోత్సవం కానుకగా ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో రిలీజైన ఫైటర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మొత్తమ్మీద హృతిక్ రోషన్ రూ. 350 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ఫైటర్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా?అని చాలా మంది నిరీక్షిస్తున్నారు. అయితే థియేటర్లలో విడుదలై సుమారు రెండు నెలలవుతున్నా ఇప్పటివరకు ఫైటర్ ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే కొన్ని గంటల క్రితమే హృతిక్ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చింది. ఫైటర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది .ఈ నేపథ్యంలో మార్చి 21 అంటే బుధవారం అర్ధరాత్రి నుంచే ఫైటర్ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. కాగా థియేటర్లలో కేవలం హిందీ వెర్షన్ ను రిలీజ్ చేశారు. ఓటీటీలో కాబట్టి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఫైటర్ సినిమాలో అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీద షేక్, అషుతోశ్ రానా, గీతా అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వయాకామ్ 22 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు భారీ బడ్జెట్ తో అత్యత ప్రతిష్ఠాత్మకంగా ఫైటర్ సినిమాను నిర్మించారు. అందుకు తగ్గట్టే ఇందులోని వీఎఫ్‌ క్స్, యాక్షన్ సీన్స్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ అందించిన బాణీలు సంగీతాభిమానులను ఆకట్టుకున్నాయి. మరి థియేటర్లలో ఫైటర్ సినిమాను మిస్ అయ్యారా? ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.