AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడా? ధోని సంచలన నిర్ణయానికి అసలు కారణమిదే

ఎంఎస్ ధోని మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ గా పేరొందిన ఎంఎస్ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని ఫ్యాన్స్ కు షాక్‌ ఇచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఒక రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాడు

MS Dhoni: అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడా? ధోని సంచలన నిర్ణయానికి అసలు కారణమిదే
MS Dhoni
Basha Shek
|

Updated on: Mar 21, 2024 | 6:23 PM

Share

ఎంఎస్ ధోని మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ గా పేరొందిన ఎంఎస్ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని ఫ్యాన్స్ కు షాక్‌ ఇచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఒక రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ గురువారం (మార్చి 21 ) అధికారికంగడా ప్రకటించింది. గత సీజన్‌లోనే ధోనీ సారథ్యంలో చెన్నై ఐదోసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. 2008లో IPL ప్రారంభమైనప్పటి నుండి, IPLలో చెన్నై సూపర్ కింగ్స్ పాల్గొన్న అన్ని సీజన్లలో ధోనీ కెప్టెన్‌గా కొనసాగాడు. 2022లో తొలిసారి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ధోనీ, జట్టు బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అది కూడా సరిగ్గా అదే పద్ధతిలో టోర్నీ ప్రారంభానికి ఒకట్రెండు రోజుల ముందు. అయితే ఈ ఫలితం బెడిసికొట్టింది. ఈ నిర్ణయం తర్వాత మొదటి 8 మ్యాచ్‌లలో 6 ఓటములు ఎదురయ్యాయి. దీంతో ధోనీ మళ్లీ జట్టు బాధ్యతలను తీసుకున్నాడు.

వీడ్కోలుకు సంకేతమా?

ఆ తర్వాతి సీజన్‌లో ధోనీ మొదటి నుంచి కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ఐదోసారి చాంపియన్‌గా నిలబెట్టి ముంబై ఇండియన్స్‌ను సమం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ ఈసారి ఆరోసారి జట్టును చాంపియన్‌గా నిలబెట్టి ముంబై, రోహిత్ శర్మల కంటే ముందుంటాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ మరోసారి తన హఠాత్తుగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ధోని హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? దీనికి కారణం ఉందా? ధోనీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడా?

రుతురాజే అసలైన వారసుడా?

దీన్ని అర్థం చేసుకోవాలంటే గత రెండు సీజన్ల పరిస్థితిని పరిశీలించాలి. ధోనీ గతంలో 2022లో కెప్టెన్సీని వదిలి జడేజాకు సారథ్య బాధ్యతలను అప్పగించాడు. అప్పటి నుంచి ఇది ధోనీకి చివరి సీజన్ అని, జడేజా పగ్గాలు చేపడతారని ఊహాగానాలు వచ్చాయి. కెప్టెన్సీ మార్పు వల్ల జట్టులో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు రాకూడదని భావించాడు ధోని. కానీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ధోని మళ్లీ కెప్టెన్ గా రావాల్సి ఉంది. అయితే ధోనికి గత 16 ఏళ్లలో చెన్నై జట్టుతో, అక్కడి అభిమానులతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇలాంటి పరిస్థితిలో, అతను ఫ్రాంచైజీని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. అటువంటి పరిస్థితిలో, అతను మరో ఏడాది పాటు ఫ్రాంచైజీకి బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్రకు నాయకత్వం వహిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌ను సాధ్యమైన వారసుడిగా గుర్తించాడు. అలాగే అతని సారథ్యంలో భారత్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని కూడా కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే చెన్నై వంటి బలమైన జట్టును నడిపించడానికి రుతురాజ్ గైక్వాడ్ సిద్ధంగా ఉన్నాడని ధోని నమ్ముతున్నాడు.

బహుశా ఇది ధోనీకి చివరి సీజన్ కావచ్చు. గత సీజన్‌లో చెన్నై విజయం సాధించినా.. ఆ సీజన్‌ను ధోనీ ఎలా మేనేజ్ చేశాడో అందరికీ తెలిసిందే. ధోని సీజన్ మొత్తం మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు. అటువంటి పరిస్థితిలో, ధోనీ ఈ సీజన్‌కు మించి ఆడాలని కోరుకోవడం లేదని, ఫ్రాంచైజీలో నాయకత్వ పరివర్తనను తన కళ్ల ముందే తన చేతులతో చేయాలని అతను కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..