IPL 2024: ధోని టు కోహ్లీ.. ఐపీఎల్ లో ఈ 5 అద్భుత రికార్డులు బద్దలు కొట్టడం అసాధ్యమే!

లీగ్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మొత్తం 16 ఎడిషన్లలో ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో అరుదైన రికార్డులు క్రియేట్ అయ్యాయి. అందులో చాలా రికార్డులను మరొకరు బద్దలు కొట్టారు. అయితే ఐపీఎల్ లో నమోదైన ఐదు ఈ 5 అద్భుత రికార్డులను బద్దలు కొట్టడం అసాధ్యమని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

IPL 2024: ధోని టు కోహ్లీ.. ఐపీఎల్ లో ఈ 5 అద్భుత రికార్డులు బద్దలు కొట్టడం అసాధ్యమే!
IPL 2024
Follow us
Basha Shek

|

Updated on: Mar 21, 2024 | 5:42 PM

మిలియన్ డాలర్ల టోర్నమెంట్ IPL విజయవంతంగా 16 ఎడిషన్‌లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు 17వ ఎడిషన్‌లోకి ప్రవేశిస్తోంది. లీగ్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మొత్తం 16 ఎడిషన్లలో ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో అరుదైన రికార్డులు క్రియేట్ అయ్యాయి. అందులో చాలా రికార్డులను మరొకరు బద్దలు కొట్టారు. అయితే ఐపీఎల్ లో నమోదైన ఐదు ఈ 5 అద్భుత రికార్డులను బద్దలు కొట్టడం అసాధ్యమని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అవేంటో తెలుసుకుందాం రండి.

క్రిస్ గేల్ 175 నాటౌట్‌

2013 ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఓపెనర్ గేల్ పూణె వారియర్స్‌పై కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో గేల్ 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాదాడు.

ఇవి కూడా చదవండి

అత్యధిక ప్లేఆఫ్‌లు

ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఆడిన 14 ఎడిషన్‌లలో సరిగ్గా 12 సార్లు ప్లేఆఫ్స్‌లో ఆడింది. రికార్డు స్థాయిలో 10 సార్లు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. 16 ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు

RCB లెజెండ్ విరాట్ కోహ్లీ IPL 2016లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో 973 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. కోహ్లి సాధించిన 973 పరుగులే ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్‌లో ఒక ఆటగాడి అత్యధిక స్కోరు.

కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు

సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ధోనీ కెప్టెన్‌గా ఇప్పటి వరకు 226 మ్యాచ్‌లు ఆడాడు. 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్న ధోనీ 16 ఏళ్ల పాటు జట్టును నడిపించాడు.

229 పరుగుల భాగస్వామ్యం

2016లో, RCB సూపర్‌స్టార్లు విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్ గుజరాత్ లయన్స్‌పై రెండవ వికెట్‌కు 229 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఇప్పటి వరకు ఈ భాగస్వామ్యాన్ని మరే జోడీ బ్రేక్ చేయలేకపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..