IPL 2024: అనుకున్నదే జరిగింది.. ధోని వారసుడొచ్చాడు.. చెన్నైకి కొత్త కెప్టెన్ ఇతడే..!

అనుకున్నదే జరిగింది. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్. దాని తగ్గట్టుగానే ఈ సీజన్ మొదలయ్యే ఒక్క రోజు ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడని ఐపీఎల్ 2024లో సీఎస్‌కే సారధ్య పగ్గాలను.. మరి ఆ స్టార్ ప్లేయర్.. ధోని వారసుడు ఎవరో తెలుసుకుందామా..

IPL 2024: అనుకున్నదే జరిగింది.. ధోని వారసుడొచ్చాడు.. చెన్నైకి కొత్త కెప్టెన్ ఇతడే..!
Csk
Follow us

|

Updated on: Mar 21, 2024 | 4:38 PM

అనుకున్నదే జరిగింది. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్. దాని తగ్గట్టుగానే ఈ సీజన్ మొదలయ్యే ఒక్క రోజు ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడని ఐపీఎల్ 2024లో సీఎస్‌కే సారధ్య పగ్గాలను.. ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేపట్టనున్నాడు. తాజాగా ఐపీఎల్ ట్రోఫీతో 10 జట్ల కెప్టెన్లు ఫోటోలు దిగగా.. అందులో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కనిపించాడు. అటు ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ కూడా చెన్నై కొత్త రుతురాజ్ అని అఫీషియల్‌గా ప్రకటించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ వైస్ కెప్టెన్ జితేష్ శర్మ అని కూడా వెల్లడించింది.

చెన్నై కొత్త కెప్టెన్..

42 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోని.. 2008లో ఐపీఎల్ మొదటి సీజన్ దగ్గర నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా కొనసాగుతూ వచ్చాడు. 12సార్లు ప్లేఆఫ్స్, 10సార్లు ఫైనల్స్‌కి ధోని సారధ్యంలోనే సీఎస్‌కే చేరింది. 2022 సీజన్ ప్రారంభంలో రవీంద్ర జడేజాకు చెన్నై పగ్గాలు అప్పగించాడు ధోని.. అయితే ఆ నిర్ణయానికి వ్యతిరేకత రావడంతో సరిగ్గా ఎనిమిది మ్యాచ్‌ల అనంతరం తిరిగి పగ్గాలు చేపట్టాడు మిస్టర్ కూల్.

ఇప్పటిదాకా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 212 మ్యాచ్‌లకు సారధ్యం వహించి.. 128 విజయాలు అందించాడు ధోని. అలాగే 82 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదుర్కుంది సీఎస్‌కే. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌‌లో అద్భుత విజయాన్ని సాధించి చెన్నైకి ఐదో ఐపీఎల్ టైటిల్ అందించాడు ధోని. దానితో చెన్నై మొత్తంగా టీ20 టోర్నమెంట్లలో ఏడు ట్రోఫీలు అందుకుంది. కాగా, ఆగష్టు 15, 2020లో ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ధోని సారధ్యంలోనే 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది టీమిండియా.

మిస్ యూ ధోని..

ట్రోఫీతో పోజులిస్తున్న కెప్టెన్లు..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..