AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్‌పై మరోసారి అభిమానం చాటుకున్న తేజ సజ్జా.. స్పెషల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌.. ఎక్కడంటే?

తేజ సజ్జా.. నటుడిగా విలక్షణమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ యువ నటుడు తనదైన అద్భుతమైన ప్రదర్శనతో, భారతీయ సినిమాల్లో చెరగని ముద్రవేసిన చిరంజీవిపై తన ప్రేమను వ్యక్తం చేసేందుకు ఒక స్పెషల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నాడు.

Chiranjeevi: మెగాస్టార్‌పై మరోసారి అభిమానం చాటుకున్న తేజ సజ్జా.. స్పెషల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌.. ఎక్కడంటే?
Teja Sajja, Chiranjeevi
Basha Shek
|

Updated on: Mar 20, 2024 | 7:29 PM

Share

హైదరాబాద్‌లో జరగనున్న సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ తొలి వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో మెగాభిమానులు, సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఈ ఉత్సవం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది గొప్ప నటుల్లో ఒకరైన లెెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ యంగ్ హీరో తేజ సజ్జా అద్భుతమైన డాన్స్ పెర్ఫామెన్స్‌ను ప్రత్యేకంగా చేయనుండటం విశేషం. ఈ సినీ ఉత్సవం మార్చి 22న నోవాటెల్ హోటల్‌లో జరగనుంది. తేజ సజ్జా డాన్స్ పెర్ఫామెన్స్ ఈవెంట్‌లో వన్ ఆఫ్ ది హైలైట్‌ కానుంది.

తేజ సజ్జా.. నటుడిగా విలక్షణమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ యువ నటుడు తనదైన అద్భుతమైన ప్రదర్శనతో, భారతీయ సినిమాల్లో చెరగని ముద్రవేసిన చిరంజీవిపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ అంకితం ఇస్తున్నారు. వేదికపై చక్కటి హావభావాలతో కళాత్మక ప్రదర్శన చేస్తూ మెగాస్టార్ చిరంజీవికి గౌరవం ఇవ్వాలనేదే తేజ సజ్జా లక్ష్యంగా కనిపిస్తోంది. చిరంజీవిపై ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తూ చేస్తూ అంకితమిచ్చే ఈ డాన్స్ పెర్ఫామెన్స్ చిరంజీవి సినీ ఇండస్ట్రీపై చూపిన ప్రభావం, కలిగించిన స్ఫూర్తిని తెలియజేసేదిగా ఉంటుంది. సినిమా ప్రపంచానికి చిరంజీవి చేసిన సహకారం తరతరాలుగా ప్రేక్షకుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది.. ఉంటుంది. తెలుగు సినీ ఐకానిక్ అయిన మెగాస్టార్‌పై గౌరవాన్ని వ్యక్తం చేస్తూ తేజ సజ్జా వేదికపై చేస్తున్న ఈ డాన్స్ పెర్ఫామెన్స్ అనేది దక్షిణాది చిత్ర పరిశ్రమలో గొప్ప నైపుణ్యాన్ని, సృజనాత్మకతను సెలబ్రేట్ చేసుకోవటంలో ఉన్న నిబద్దతను తెలియజేస్తుంది.

ఇవి కూడా చదవండి

మెగా స్టార్ ముఖ్య అతిథిగా  సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.