AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suhas – Keerthy Suresh: సుహాస్‌కు జోడీగా కీర్తి సురేశ్‌.. క్రేజీగా సినిమా టైటిల్.. నేరుగా ఓటీటీలోకి ఎప్పుడంటే?

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమైంది. స్టార్ హీరోయిన్ గా మస్త్ క్రేజ్ ఉన్న మహానటి కీర్తి సురేశ్‌, ఇప్పుడిప్పుడే హీరోగా సత్తా చాటుతోన్న సుహాస్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ సినిమా రానుంది. తాజాగా ఈ ఆసక్తికరమైన సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది

Suhas - Keerthy Suresh: సుహాస్‌కు జోడీగా కీర్తి సురేశ్‌.. క్రేజీగా సినిమా టైటిల్.. నేరుగా ఓటీటీలోకి ఎప్పుడంటే?
Suhas, Keerthy Suresh
Basha Shek
|

Updated on: Mar 20, 2024 | 6:58 PM

Share

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమైంది. స్టార్ హీరోయిన్ గా మస్త్ క్రేజ్ ఉన్న మహానటి కీర్తి సురేశ్‌, ఇప్పుడిప్పుడే హీరోగా సత్తా చాటుతోన్న సుహాస్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ సినిమా రానుంది. తాజాగా ఈ ఆసక్తికరమైన సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. నిన్నిలా.. నిన్నిలా మూవీ ఫేమ్ అని ఐవీ శశి తెరకెక్కించనున్న ఈ సినిమాకు ఉప్పుకప్పురంబు అని టైటిల్ ను ఖరారు చేశారు. వసంత్ మురళీ కృష్ణ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. రాధిక లావూ నిర్మాతగా వ్యవహరించనున్నారు.త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. మంగళవారం (మార్చి 19) న జరిగిన ఒక ఈవెంట్ లో సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. అమెజాన్ ఒరిజినల్స్ మూవీ గా తెరకెక్కనుందంటే.. ఉప్పుకప్పురంబు సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజ్ కానుందన్న మాట. సినిమా షూటింగ్ పూర్తయ్యాక అధికారిక స్ట్రీమింగ్ డేట్ ను వెల్లడించనుంది అమెజాన్ ప్రైమ్ వీడియో.

సినిమా లైన్ ఏంటంటే?

ఇదిలా ఉంటే ఇదే ఈవెంట్ లోనే ఉప్పు కప్పురంబు సినిమా స్టోరీ లైన్‍ను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది. పూర్తి సెటైరికల్ కామెడీ మూవీగా ఇది రానుందట. ‘స్మశానంలో స్థలం అయిపోవడంతో ఓ గ్రామంలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది అక్కడి జనాల మధ్య తీవ్ర గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. మరి ఆ గ్రామస్తుల సమస్య పరిష్కారమైందా? ఇందులో సుహాస్, కీర్తిల పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఉప్పుకప్పురంబు టైటిల్ తో..

నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!