Sai Dharam Tej: మనల్ని ఎవడ్రా ఆపేది? పవన్, ధోనీలపై మెగా మేనల్లుడి ఇంట్రెస్టింగ్‌ పోస్ట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఇందులో తన మేనమామ, జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు

Sai Dharam Tej: మనల్ని ఎవడ్రా ఆపేది? పవన్, ధోనీలపై మెగా మేనల్లుడి ఇంట్రెస్టింగ్‌ పోస్ట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Sai Dharam Tej
Follow us
Basha Shek

|

Updated on: Mar 20, 2024 | 9:28 PM

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఇందులో తన మేనమామ, జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్, ఎంఎస్ ధోనిల సీడీపీని రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత ట్విట్టర్ లో దానిని షేర్ చేశాడు. ‘ వీరు నా అభిమాన వ్యక్తులు. వారి విజయాలతో నన్ను ఎప్పుడూ ప్రేరేపిస్తుంటారు. నాకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. త్వరలో వీరిద్దరూ తమ తమ రంగాలలో కొత్త ఆధ్యాయాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంలో ఈ ఇద్దరి సీడీపీని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చారు తేజ్. చివరగా ఈ ఫొటోకు ‘మనల్ని ఎవడ్రా ఆపేది’అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం తేజ్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసి అటు మెగాభిమానులు, ఇటు ధోని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. యాక్సిడెంట్ తర్వాత రెండు సినిమాల్లో నటించాడు సాయి ధరమ్ తేజ్. ఇందులో విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన బ్ యావరేజ్‌ గా నిలిచింది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నాడీ సుప్రీం హీరో. కాగా ఇటీవలే తన పేరును సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్నాడు మెగా మేనల్లుడు. అలాగే ఇదే పేరుపై సొంతంగా నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

వీరే నా అభిమాన వ్యక్తులు..

ఇకపై సాయి దుర్గా తేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.