IPL 2024: 453 రోజుల తర్వాత క్రికెట్ గ్రౌండ్‌లోకి.. పంత్‌కు ప్రేక్షకుల స్టాండింగ్ ఒవేషన్.. వీడియో చూస్తే గూస్ బంప్స్

2022 డిసెంబర్ 30న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. కొన్ని నెలల పాటు ఆస్పత్రిలోనే ఉండి శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వచ్చింది. దీంతో పంత్ క్రికెట్ కెరీర్ పై అనుమానలు తలెత్తాయి. కానీ రిషబ్ మాసిక ధైర్యం, పట్టుదల, ధృడ సంకల్పం తో ముందుకు సాగాడు. వీలైనంత త్వరగా జట్టులోకి రావాలన్న తపనతో ప్రాక్టీస్ చేశాడు

IPL 2024: 453 రోజుల తర్వాత క్రికెట్ గ్రౌండ్‌లోకి.. పంత్‌కు ప్రేక్షకుల స్టాండింగ్ ఒవేషన్.. వీడియో చూస్తే గూస్ బంప్స్
Rishabh Pant
Follow us
Basha Shek

|

Updated on: Mar 23, 2024 | 6:42 PM

టీమిండియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఎట్టకేలకు క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడు. 2022 డిసెంబర్ 30న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. కొన్ని నెలల పాటు ఆస్పత్రిలోనే ఉండి శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వచ్చింది. దీంతో పంత్ క్రికెట్ కెరీర్ పై అనుమానలు తలెత్తాయి. కానీ రిషబ్ మాసిక ధైర్యం, పట్టుదల, ధృడ సంకల్పం తో ముందుకు సాగాడు. వీలైనంత త్వరగా జట్టులోకి రావాలన్న తపనతో ప్రాక్టీస్ చేశాడు. అలా దాదాపు 14 నెలల తర్వాత క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చాడీ యంగ్ క్రికెటర్. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఢిల్లీ తొలి మ్యాచ్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్.. టాస్ సందర్భంగా గత 14 నెలల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. నిజానికి పంత్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ కాబట్టి అతని పునరాగమనానికి సంబంధించి చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఎందుకంటే వికెట్ కీపింగ్ సమయంలో మోకాలిని ఎక్కువగా ఉపయోగిస్తారు. పంత్ మునుపటిలా వికెట్ కీపింగ్ చేయగలడా అనే అనుమానం ఉంది. అయితే, అన్ని సందేహాలను పక్కనపెట్టి పంత్ ఐపీఎల్‌లోకి తిరిగి వచ్చాడు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ’మేం ముందుగా బ్యాటింగ్ చేస్తున్నాం. వికెట్ కాస్త స్లోగా కనిపిస్తోంది. ఇది నిజంగా నాకు ఎమోషనల్ టైమ్. నేను ఈ క్షణం ఆనందించాలనుకుంటున్నాను. నేను పెద్దగా ఆలోచించను. గత సీజన్ గురించి నేను చింతించను. ఇది నాకు నిజంగా ఉత్తేజకరమైన సమయం. బాగా ప్రిపేర్ అయ్యాం’ అని భావోద్వేగానికి గురయ్యాడు పంత్. మ్యాచ్ విషయానికి వస్తే… నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌కు స్టేడియంలో గుమిగూడిన అభిమానుల నుంచి అద్భుతమైన స్వాగతం లభించింది. అందరూ చప్పట్లు కొడుతూ పంత్‌కు స్వాగతం పలికారు. అయితే రీ ఎంట్రీ మ్యాచ్ లో పంత్ నిరాశపర్చాడు. డేవిడ్ వార్నర్ వికెట్ తర్వాత వచ్చిన పంత్ 13 బంతుల్లో 2 బౌండరీలతో 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చివర్లో హర్షల్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇలా 14 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చిన పంత్ అద్భుత ప్రదర్శన చేయలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

 బ్యాటింగ్ కు వస్తోన్న పంత్..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. మొదట మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఢిల్లీకి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ మూడు ఓవర్లలో 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ నాలుగో ఓవర్‌లో మిచెల్ మార్ష్ వికెట్ పడింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, షాయ్ హోప్ వచ్చారు. వీరిద్దరూ 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ జోడీని హర్షల్ పటేల్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత అందరూ ఎదురుచూస్తున్న రిషబ్ పంత్ రంగంలోకి దిగాడు. కానీ తన ఇన్నింగ్స్‌లో 12 బంతులు ఎదుర్కొని 2 బౌండరీల సాయంతో 18 పరుగులు చేసి వికెట్‌ సమర్పించుకున్నాడు. చివర్లో ఢిల్లీ తరుపున అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ పోరెల్ 10 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో 25 పరుగులు కూడా చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు.

రిషబ్ ఎమోషనల్ వర్డ్స్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..