IPL 2024: SRH అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. పుష్ప డైలాగ్‌తో వార్నింగ్ ఇచ్చిన హైదరాబాదీ ప్లేయర్.. వీడియో

శనివారం (మార్చి 23) డబుల్ హెడ్డర్ మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ లో ఢిల్లీ, పంజాబ్ తలపడనుండగా, సాయంత్రం మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే కేకేఆర్ తో మ్యాచ్ కు ముందు ఎస్ఆర్ హెచ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తెలుగు సినిమా డైలాగులతో అదరగొట్టాడు.

IPL 2024: SRH అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. పుష్ప డైలాగ్‌తో వార్నింగ్ ఇచ్చిన హైదరాబాదీ ప్లేయర్.. వీడియో
Washington Sundar, Allu Arjjun
Follow us
Basha Shek

|

Updated on: Mar 23, 2024 | 7:22 PM

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో ఆర్సీబీపై సీఎస్కే ఘన విజయం సాధించింది. ఇక శనివారం డబుల్ హెడ్డర్ మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ లో ఢిల్లీ, పంజాబ్ తలపడనుండగా, సాయంత్రం మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే కేకేఆర్ తో మ్యాచ్ కు ముందు ఎస్ఆర్ హెచ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తెలుగు సినిమా డైలాగులతో అదరగొట్టాడు. అల్లు అర్జున్ పుష్ప, బాలకృష్ణ అఖండ, అల్లు అర్జున్ సరైనోడు సినిమాల్లోని డైలాగులను తనదైన స్టెల్ లో చెప్పి ఫ్యాన్స్ ను అలరించాడు. ‘ఎస్ఆర్‌హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్.. కమిన్స్ అంటే క్లాస్ కాదు ఊర మాస్’ అంటూ అదరగొట్టేశాడు సుందర్. దీనికి సంబంధించిన వీడియోను తమ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసింది స్టార్ స్పోర్ట్స్ తెలుగు. ఆటలో ఆల్‌రౌండర్.. తెలిసిందే. కానీ, ఈ డైలాగ్స్ ఏంటి మాస్టారూ. ఇరగదీసేసారుగా. మరి మ్యాచ్‌లో కూడా మడతెట్టేయండి’ అని వాషింగ్టన్ సుందర్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. క్రికెట్ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

కాగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ వేదికగా కేకేఆర్ వర్సెస్ ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లలో స్టార్ బ్యాటర్లు, బౌలర్లు ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది. ముఖ్యంగా కెప్టెన్ కమిన్క్ స్టార్క్, మిచెల్ స్టార్క్ ల ఆట కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వాషింగ్టన్ సుందర్ డైలాగ్స్.. వీడియో

సన్ రైజర్స్ కు మద్దతుగా శ్రీ విష్ణు “ఓం భీమ్ బుష్”

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ