AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppenheimer OTT: ఓటీటీలోకి ఓపెన్ హైమర్‌ తెలుగు వెర్షన్.. 7 ఆస్కార్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

హాలీవుడ్ సినిమాలు చూసే తెలుగు సినీ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల ఆస్కార్ వేడుకల్లో ఏకంగా 7 అవార్డులు సొంతం చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఓపెన్ హైమర్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది జులైలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

Oppenheimer OTT: ఓటీటీలోకి ఓపెన్ హైమర్‌ తెలుగు వెర్షన్.. 7 ఆస్కార్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Oppenheimer Movie
Basha Shek
|

Updated on: Mar 24, 2024 | 3:07 PM

Share

హాలీవుడ్ సినిమాలు చూసే తెలుగు సినీ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల ఆస్కార్ వేడుకల్లో ఏకంగా 7 అవార్డులు సొంతం చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఓపెన్ హైమర్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది జులైలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అణు బాంబు సృష్టికర్త ప్రముఖ శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా చేసుకుని ‘ఓపెన్‌ హైమర్‌’ను తెరకెక్కించారు హాలీవుడ్ మాస్టర్ మైండ్ క్రిస్టోఫర్ నోలన్. సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఓపెన్ హైమర్ సినిమాకు అవార్డుల పంట కూడా పండింది. ఇటీవల జరిగిన 96వ అకాడమీ అవార్డులు ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో మొత్తం ఏడు ఆస్కార్ అవార్డులు ఈ సినిమాకే వచ్చాయి. అంతకు ముందు గోల్గెన్ గోబ్స్, BAFTA వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు ఓపెన్ హైమర్ ను వరించాయి. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఓపెన్ హైమర్ సినిమా మార్చి 21వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘జియోసినిమా’ లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే ముందుగా కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే ఆదివారం (మార్చి 24) తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల వెర్షన్‍న్లను కూడా జియోసినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం ఒరిజినల్ ఇంగ్లిష్ సహా హిందీ, తెలుగుతో పాటు మరో 5 భారతీయ భాషల్లో ఓపెన్‍హైమర్ మూవీ జియోసినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ ఓపెన్ హైమర్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే అది కేవలం రెంట్ బేసిసిలో మాత్రమే. ఇప్పుడు జియో సినిమా సబ్ స్క్రైబర్లందరూ ఉచితంగా ఈ బ్లాక్ బస్టర్ సినిమాను వీక్షించవచ్చు. ఓపెన్ హైమర్ సినిమాలో ఫ్లోరెన్స్ పగ్, రాబర్ట్ డౌనీ జూనియర్, గ్యారీ ఓల్డ్‌మన్, రామి మాలెక్, కెన్నెత్ బ్రనాగ్ తదితరులు వివిధ పాత్రలు పోషించారు. మరి వీకెండ్ లో మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఓపెన్ హైమర్ పై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

జియో సినిమాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us