Manjummel Boys OTT: ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమెల్ బాయ్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

మలయాళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రం 'మంజుమెల్‌ బాయ్స్‌' . యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. చాలా సహజంగా, ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించడం మలయాళ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు

Manjummel Boys OTT: ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమెల్ బాయ్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Manjummel Boys Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 26, 2024 | 4:49 PM

మలయాళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రం ‘మంజుమెల్‌ బాయ్స్‌’ . యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. చాలా సహజంగా, ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించడం మలయాళ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజైన మంజుమెల్ బాయ్స్ రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఈ ఘనత సాధించిన తొలి మలయాళ సినిమాగా రికార్డుల కెక్కింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ముంజుమెల్ బాయ్స్ తెలుగు వెర్షన్‍ను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ సర్వైవల్ థ్రిల్లర్ థియేటర్లలో రిలీజై దాదాపు నెల కావొచ్చింది. దీంతో ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంజుమెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ పై కీలక అప్డేట్ వచ్చింది. ‘మంజుమెల్ బాయ్స్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను చూడొచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

యదార్థ సంఘటనల ఆధారంగా

మంజుమెల్ బాయ్స్ సినిమాను యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. 2006లో, కొచ్చి సమీపంలోని మంజుమ్మెల్‌కు చెందిన యువకులు విహారయాత్ర కోసం కొడైకెనాల్ వెళతారు. అక్కడ చాలా సేపు గడిపిన తర్వాత గుణ గుహకు వెళతారు. అయితే గ్రూప్ లో ఒకర ప్రమాదవశాత్తూ గుహలో పడిపోతారు. అతడిని కాపాడే ప్రయత్నంలో ఆ గ్రూప్‍లోని స్నేహితులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యానేదే మంజుమెల్ బాయ్స్ సినిమా .

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

నిర్మాతలకు కాసుల పంట..

‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫిబ్రవరి 22న థియేటర్లలో విడుదలైంది. ఐదు కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇప్పటివరకు 200 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఇది సినిమాకి పొడిగింపు. ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అతనికి రెండో సినిమా. సౌబిన్ షాహిర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.