Kangana Ranaut: లోక్ సభ ఎన్నికల బరిలో కంగన.. అధికారికంగా ప్రకటించిన బీజేపీ.. పోటీ ఎక్కడినుంచంటే?

భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఐదవ జాబితాను ఆదివారం (మార్చి 24) విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థుల పేర్లను జాబితాలో చేర్చింది. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ పేరు కూడా ఉంది.

Kangana Ranaut: లోక్ సభ ఎన్నికల బరిలో కంగన.. అధికారికంగా ప్రకటించిన బీజేపీ.. పోటీ ఎక్కడినుంచంటే?
Kangana Ranaut
Follow us
Basha Shek

|

Updated on: Mar 24, 2024 | 9:52 PM

భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఐదవ జాబితాను ఆదివారం (మార్చి 24) విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థుల పేర్లను జాబితాలో చేర్చింది. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ పేరు కూడా ఉంది. హిమాచల్‌లోని మండి నుంచి నటి కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపనున్నట్లు బీజేప ప్రకటించింది. కాగా బీజేపీకి బలమైన మద్దతుదారుల లిస్టులో కంగనా రనౌత్ పేరు తప్పకుండా ఉంటుంది. నరేంద్ర మోడీకి పలు సార్లు బహిరంగంగానే మద్దతు పలికిందామె. ఇక కంగనా నటనా ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం కూడా ప్రకటించింది. అప్పటి నుంచే ఆమె బీజేపీ తరఫున ఎన్నికల బరిలో దిగనుందని వార్తలు వచ్చాయి. కంగనా కూడా సమయమొచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానంది. ఇప్పుడిదే నిజమయ్యింది.

ఇవి కూడా చదవండి

కంగనా రనౌత్ తో పాటు బాలీవుడ్ నుంచి అరుణ్ గోవిల్ కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. రామాయణం సీరియల్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ గోవిల్ ఇటీవల విడుదలైన ఆర్టికల్ 370 సినిమాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాత్రలో నటించి మెప్పించారు.

కంగనా ట్వీట్..

.

ఈసారి పిలిభిత్ నుంచి సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీ, ఘజియాబాద్ నుంచి జనరల్ వీకే సింగ్ టికెట్లను పార్టీ రద్దు చేసింది. పిలిభిత్‌ నుంచి జితిన్‌ ప్రసాద్‌, ఘజియాబాద్‌ నుంచి అతుల్‌ గార్గ్‌లను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ జాబితాలో యూపీలో 13, రాజస్థాన్‌లోని 7 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేశ్‌, రాజమండ్రి నుంచి డీ పురందేశ్వరి, నర్సాపురం నుంచి బూపతిరాజ్‌ శ్రీనివాస్‌ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డికి టిక్కెట్లు సొంతం చేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి