Nuvve Kavali: సూపర్ హిట్ ‘నువ్వే కావాలి’ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెల్సా..?
దాదాపు రూ.కోటి బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ అప్పుడే రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొత్తం 20 సెంటర్లలో దాదాపు 200 రోజులకుపైగా ఆడి.. నేషనల్ అవార్డుతోపాటు.. అనేక రికార్డ్స్ సొంతం చేసుకున్న సినిమా ఇదే. ఇందులో తరుణ్ సరసన రిచా పల్లోడ్ కథానాయికగా నటించింది. ఇక ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. కోటి అందించిన పాటలు సెన్సెషన్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్, డైలాగ్స్ ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటాయి.

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు తరుణ్. ఎన్నో ప్రేమకథలతో థియేటర్లలో సందడి చేసి యూత్‌ను అలరించాడు ఈ హీరో. తరుణ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీ మూవీస్ ఉన్నాయి. అందులో ‘నువ్వే కావాలి’ ఒకటి. 2000లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దాదాపు రూ.కోటి బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ అప్పుడే రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొత్తం 20 సెంటర్లలో దాదాపు 200 రోజులకుపైగా ఆడి.. నేషనల్ అవార్డుతోపాటు.. అనేక రికార్డ్స్ సొంతం చేసుకున్న సినిమా ఇదే. ఇందులో తరుణ్ సరసన రిచా పల్లోడ్ కథానాయికగా నటించింది. ఇక ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. కోటి అందించిన పాటలు సెన్సెషన్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్, డైలాగ్స్ ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటాయి. మొత్తంగా ఈ మూవీ తరుణ్ కెరీర్‌ను మలుపు తిప్పింది.
అయితే ఈ సూపర్ హిట్ మూవీ ఛాన్స్ ముందుగా హీరో సుమంత్ కు వచ్చిందట. అప్పుడే ఆయన మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. దీంతో ఈ మూవీలో నటించలేకపోయారట. దీంతో నువ్వే కావాలి సినిమా తరుణ్ వద్దకు చేరింది. అలా ఈ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు తరుణ్. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ హీరో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
తరుణ్, మధు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు. ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకుంటారు. ఆ సమయంలోనే మధును ప్రాణంగా ప్రేమిస్తాడు తరుణ్. తన ప్రేమను బయటపెడితే ఎక్కడ తమ స్నేహం ముక్కలవుతుందోనని చెప్పకుండా దాస్తాడు. ఈ విషయం తెలియని మధ మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అవుతుంది. పెళ్లి సమయానికి తరుణ్ తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడని మధుకు తెలిసిపోతుంది. చివరకు ఇద్దరు కలుసుకుంటారు. అలా కథ సుఖాంతం అవుతుంది.