Hyderabad: బల్కంపేట ఎల్లమ్మ గుడిలో అనూహ్యంగా ప్రత్యక్షమైన టాలీవుడ్ టాప్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?
గుడిలో ఆ హీరోయిన్ కనిపించగానే అందరూ స్టన్ అయ్యారు. సాదాసీదాగా వచ్చేసరికి తొలుత ఆమేనా, కాదా అని డౌట్ పడ్డారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేసేసరికి హీరోయిన్ అని నిర్ధారించుకుని.. ఫోటోల కోసం ఎగబడ్డారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

బడా హీరోయిన్లు పెద్ద పెద్ద ఈవెంట్లలో లేదా ఎయిర్‌పోర్టుల్లో లేదా సెలబ్రిటీల ఇళ్లలో ఏవైనా ఫంక్షన్స్ ఉంటే కనిపించడం మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో వారికి చాలామంది రక్షణగా ఉంటారు. వారు ఏదైనా టెంపుల్‌కి వెళ్లినా అక్కడ కూడా వీఐపీ ప్రొటోకాల్ ఉంటుంది. వీఐపీ విరామ సమయంలో వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఓ టాలీవుడ్ టాప్ హీరోయిన్.. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ గుడికి చాలా సాధాసీదాగా వెళ్లారు. ఆమె ఎవరో కాదండోయ్.. సీతారామం హీరోయిన్.. మృణాల్ ఠాకూర్. తొలుత ఆమెను చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత ఫోటోలు కోసం ఎగబడ్డారు. పూజల అనంతరం అడిగిన అందరికీ ఫోటోలు ఇచ్చారు మృణాల్. గుడిలోని పూజారి మృణాల్‌కు ప్రత్యేక ఆశీర్వాదం ఇచ్చారు. త్వరలో విడుదలవుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా హిట్ అవ్వాలని దీవించండి అని మృణాల్ కోరడంతో.. ఆయన కూడా అలాగే దీవించారు.
బల్కంపేట ఎల్లమ్మను దర్శించిన అనంతరం ఆ ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేశారు మృణాల్. “ఏదైనా పెద్ద పనిని ప్రారంభించే ముందు కొంత సమయం ప్రార్థించేందుకు కేటాయింమని నా తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకు నేను అలాంటి సమయాల్లో గుడిలోకి వెళ్లి.. నా మనసులో ఉన్నదంతా చెప్పుకుంటాను. ఇప్పుడు నేను, నా ఫ్యామిలీ స్టార్ కుటుంబం ప్రమోషన్‌లకు సిద్ధమవుతున్నందున ఆశీర్వాదం కోసం హైదరాబాద్‌లోని బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించాము” అని మృణాల్ పేర్కొన్నారు.
View this post on Instagram
‘సీతారామం’లో సీతగా జీవించిన మృణాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో మంచి పాత్ర చేసింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రజంట్ మృణాల్ డేట్స్ కోసం మేకర్స్ ఎగబడుతున్నారు. నెక్ట్స్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆమే అని చెబుతున్నారు టాలీవుడ్ పెద్దలు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
