- Telugu News Photo Gallery Cinema photos Rishab Shetty Kantara 2 Movie Makers plan To Release in Sankranthi 2025 Telugu Heroes Photos
Kantara 2: 2025 సంక్రాంతి బరిలో కాంతార 2.? మేకర్స్ మాటేంటి.?
కాంతార 2 అనుకున్న దానికంటే ఎందుకు ఆలస్యమవుతుంది..? షూటింగ్ లేట్ అవుతుందా లేదంటే కథా పరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారా..? బడ్జెట్ అదుపు తప్పుతున్నా కూడా నిర్మాతలు అంత నిశ్చింతగా ఉండటానికి కారణమేంటి..? ఏ లెక్కన సీక్వెల్ కోసం ఇంతగా ఖర్చు పెడుతున్నారు.? అసలు కాంతార 2 వచ్చేదెప్పుడు..? 2024లో కూడా రాదా..? జైలర్‌లో ఓ డైలాగ్ ఉంటుంది.. వర్త్ వర్మ వర్త్ అని..!
Updated on: Mar 25, 2024 | 2:33 PM

కాంతార 2 అనుకున్న దానికంటే ఎందుకు ఆలస్యమవుతుంది..? షూటింగ్ లేట్ అవుతుందా లేదంటే కథా పరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారా..? బడ్జెట్ అదుపు తప్పుతున్నా కూడా నిర్మాతలు అంత నిశ్చింతగా ఉండటానికి కారణమేంటి..?

ఏ లెక్కన సీక్వెల్ కోసం ఇంతగా ఖర్చు పెడుతున్నారు.? అసలు కాంతార 2 వచ్చేదెప్పుడు..? 2024లో కూడా రాదా..? జైలర్‌లో ఓ డైలాగ్ ఉంటుంది.. వర్త్ వర్మ వర్త్ అని..! ఓ విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నపుడు అది వర్త్ అనిపిస్తే.. ఎదురు చూపులన్నీ మరిచిపోతుంటారు.

కాంతార 2 విషయంలో ఇదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి. కాంతార సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం.. 18 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. కర్ణాటకలోని భూత కోల సంప్రదాయ నేపథ్యంలో వచ్చింది.

గతేడాదే 'కాంతార-2' ప్రకటించారు మేకర్స్. ఇప్పటి వరకు కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే జరుగుతుంది. ఎప్రిల్ నుంచి షూటింగ్ మొదలు కానుంది.

గతేడాది వచ్చిన టీజర్‌లో రిషబ్ శెట్టి లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. అంతా అనుకుంటున్నట్లు ఇది సీక్వెల్ మాత్రం కాదు.. ప్రీక్వెల్.

కాంతార కథకి చాలా చరిత్ర ఉందని.. అసలు కథ అంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. నిజానికి 2024 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తే.. షూటింగే ఇప్పుడు మొదలవుతుంది.

ఎప్రిల్ నుంచి నాన్ స్టాప్ షూట్ చేసి.. 2025 సమ్మర్‌కు కాంతార ఏ లెజెండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, బెంగాళీ, ఇంగ్లీష్‌లోనూ కాంతారా 2 విడుదల కానుంది.




