- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun Boyapati Combo added in Bunny Next Movies List After Pushpa 2 Telugu Heroes Photos
Allu Arjun: డైరెక్టర్స్ ను లైన్లో పెట్టిన బన్నీ.! ముందు అట్లే నా? బోయపాటి నా?
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి..? పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారు..? త్రివిక్రమ్‌తో ఉండబోతుందని అనౌన్స్ చేసారు కానీ అదిప్పట్లో ఉండేలా కనిపించట్లేదు. అట్లీతో ఉందనే టాక్ వస్తున్నా.. దీనిపై అధికారిక సమాచారం లేదు.
Updated on: Mar 25, 2024 | 3:22 PM

అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి..? పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారు..? త్రివిక్రమ్‌తో ఉండబోతుందని అనౌన్స్ చేసారు కానీ అదిప్పట్లో ఉండేలా కనిపించట్లేదు. అట్లీతో ఉందనే టాక్ వస్తున్నా.. దీనిపై అధికారిక సమాచారం లేదు.

ఈ దాగుడుమూతల్లో బన్నీ ఓటు ఎవరికి పడబోతుంది..? వీటన్నింటినీ కాదని పుష్ప 3 లైన్‌లోకి వస్తుందా..? అనుకున్నట్లుగానే ఆగస్ట్ 15 నుంచి పుష్ప గాడి రూల్ ఉంటుందని చెప్తున్నారు దర్శక నిర్మాతలు. దాంతో పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయబోతున్నారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుందిప్పుడు.

ఆ మధ్య త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప్రకటించినా.. అది ఇంకాస్త ఆలస్యమయ్యేలా ఉంది. దాంతో అట్లీ, బోయపాటి శ్రీను సడన్‌గా రేసులో ముందుకొచ్చారు. సరైనోడుతో గతంలో బన్నీ మాస్ ఇమేజ్ బాగా పెంచారు బోయపాటి.

పైగా గీతా ఆర్ట్స్ ఈ మధ్యే బోయపాటితో సినిమా ఉందని కన్ఫర్మ్ చేసారు. అయితే అందులో హీరో బన్నీయేనా కాదా అనేది సస్పెన్స్. మరోవైపు త్రివిక్రమ్ సినిమా మొదలవ్వడానికి 2025 సమ్మర్ అవుతుందని తెలుస్తుంది.

కెరీర్‌లో ఫస్ట్ టైమ్ సోషియో ఫాంటసీని ట్రై చేస్తున్నారు గురూజీ. బోయపాటి, త్రివిక్రమ్ ఇద్దరూ రేసులోనే ఉన్నా.. వీళ్ల కంటే ముందు అట్లీతో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుంది. పుష్ప 2 తర్వాత బన్నీ ఇమ్మీడియట్‌గా చేసే సినిమా కూడా ఇదే కావచ్చు.

పుష్ప 3 ఉందనే టాక్ వినిపిస్తున్నా.. మార్చి 27న రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. అంటే పుష్ప 3 ఇప్పట్లో లేనట్లే. నాలుగేళ్లుగా పుష్ప వరల్డ్‌లోనే ఉన్నారు అల్లు అర్జున్.

ఆగస్ట్ 15 డెడ్ లైన్ కావడంతో.. షూటింగ్ కూడా జెట్ స్పీడ్‌లో చేస్తున్నారు. నెక్ట్స్ సినిమా ఎవరితో అయినా కూడా.. ముందు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారు బన్నీ. ఆ తర్వాతే కొత్త సినిమా సెట్స్‌పైకి రానుంది. మొత్తానికి కళ్ల ముందే ఆప్షన్స్ ఉన్నా.. కన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వట్లేదు అల్లు వారబ్బాయి.




