- Telugu News Photo Gallery Cinema photos Horror Movies with Comedy are getting good response and collections in Tollywood Telugu Entertainment Photos
Horror Movies: హారర్ ప్లస్ కామెడీ తో ఇండస్ట్రీను ఊపేస్తున్న సినిమాలు. ఇప్పుడిదే ట్రెండ్.
అనగనగా ఓ ఊరు.. ఊళ్లో దెయ్యం.. చేతబడులు, క్షుద్ర పూజలు.. టాలీవుడ్‌లో ఇప్పుడిదే సక్సెస్ ఫార్ములా. అలాంటి జోనర్‌లో కథ ఉందంటే వెంటనే ఓకే అంటున్నారు హీరోలు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కు బాగా కాసులు కురిపించిన జోనర్ ఇది. తాజాగా మరో సినిమా కూడా ఈ దారిలోనే వచ్చి మెప్పిస్తుంది. మరి ఏంటా సినిమా..? ఇంతకీ ఈ దెయ్యం కథల ముచ్చటేంటి..? హార్రర్ విత్ కామెడీ.. అప్పట్లో సెన్సేషనల్ కాంబినేషన్ ఇది. ఇప్పుడైతే ఇదే ట్రెండ్.
Updated on: Mar 25, 2024 | 1:54 PM

అనగనగా ఓ ఊరు.. ఊళ్లో దెయ్యం.. చేతబడులు, క్షుద్ర పూజలు.. టాలీవుడ్‌లో ఇప్పుడిదే సక్సెస్ ఫార్ములా. అలాంటి జోనర్‌లో కథ ఉందంటే వెంటనే ఓకే అంటున్నారు హీరోలు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కు బాగా కాసులు కురిపించిన జోనర్ ఇది. తాజాగా మరో సినిమా కూడా ఈ దారిలోనే వచ్చి మెప్పిస్తుంది. మరి ఏంటా సినిమా..? ఇంతకీ ఈ దెయ్యం కథల ముచ్చటేంటి..?

హార్రర్ విత్ కామెడీ.. అప్పట్లో సెన్సేషనల్ కాంబినేషన్ ఇది. ఇప్పుడైతే ఇదే ట్రెండ్. ఊళ్లో జరిగే దెయ్యాల కథల వైపు అడుగులేస్తున్నారు. తాజాగా ఓం భీమ్ బుష్ కూడా అనగనగా ఓ ఊళ్లో దెయ్యం కథే. శ్రీ విష్ణు హీరోగా హర్ష తెరకెక్కించిన ఈ చిత్రంలో కామెడీకి ఢోకా లేదు. సామజవరగమనా తర్వాత శ్రీ విష్ణు కెరీర్‌కు మరింత బలంగా పునాది వేసింది ఓం భీమ్ బుష్.

గతేడాది పాయల్ రాజ్‌పుత్, అజయ్ భూపతి కాంబినేషన్‌లో వచ్చిన మంగళవారం కూడా మంచి విజయమే సాధించింది. ఈ మధ్యే ఊరి పేరు భైరవకోనతో వచ్చారు సందీప్ కిషన్. ఇది కూడా ఓకే అనిపించింది.

కొన్నేళ్లుగా సరైన హిట్ లేని సందీప్‌కు ఊరటనిచ్చింది ఊరి పేరు భైరవకోన. ఆ మధ్య సూపర్ హిట్టైన మా ఊరి పొలిమేర 2 కథ కూడా ఒకే ఊరిలో జరుగుతుంది.. చేతబడులే ఇందులో మెయిన్ స్టోరీ.

సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్ సినిమా విరూపాక్షలోనూ చేతబడులే ఉన్నాయి. రెండేళ్ల కింద బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన మసూధ బ్లాక్‌బస్టర్ అయింది.

మొన్నొచ్చిన అనన్య నాగళ్ల తంత్రలోనూ ఉన్నవన్నీ దెయ్యాలే. ఈ సినిమాలు చూసాక.. చాలా మంది దర్శకుల కన్ను హార్రర్ డ్రామాస్ వైపు వెళ్తుంది. తాజాగా ఓం భీమ్ బుష్‌తో ఈ ట్రెండ్‌కు మరింత ఊపొచ్చింది.




