- Telugu News Photo Gallery Cinema photos Karthika Deepam Serial Second Season Nava Vasantham Promo goes viral Know About new Actress Gayathri Simhadri telugu movie news
Karthika Deepam: కార్తీక దీపం సీరియల్లో కొత్త నటి.. మోనిత స్థానంలో ఎవరీ అమ్మాయి ?
బుల్లితెరపై సెన్సెషన్ సృష్టించిన సీరియల్ కార్తీక దీపం. దాదాపు ఆరు సంవత్సరాలు నెంబర్ వన్ సీరియల్ గా టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోయింది. ఇక ఇందులోని డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు ఫ్యామిలీ అడియన్స్ కు మరింత దగ్గరయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సీరియల్ కు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక దీపం ఇది నవ వసంతం పేరుతో సెకండ్ సీజన్ రాబోతుంది. నేటి నుంచి ఈ సీరియల్ రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ కాబోతుంది.
Updated on: Mar 25, 2024 | 10:26 AM

బుల్లితెరపై సెన్సెషన్ సృష్టించిన సీరియల్ కార్తీక దీపం. దాదాపు ఆరు సంవత్సరాలు నెంబర్ వన్ సీరియల్ గా టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోయింది. ఇక ఇందులోని డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు ఫ్యామిలీ అడియన్స్ కు మరింత దగ్గరయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సీరియల్ కు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే.

కార్తీక దీపం ఇది నవ వసంతం పేరుతో సెకండ్ సీజన్ రాబోతుంది. నేటి నుంచి ఈ సీరియల్ రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ కాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోస్ చూస్తుంటే.. ఈసారి కార్తీక దీపం కథ కొత్తగా స్టార్ట్ కానున్నట్లు అర్థమవుతుంది. ఇందులోని పాత్రలను కూడా పరిచయం చేశారు మేకర్స్.

అయితే కార్తీక దీపం అంటే డాక్టర్ బాబు, వంటలక్క మాత్రమే కాదు.. మోనిత కూడా. గత సీజన్ లో మోనిత పాత్రలో శోభాశెట్టి నటించింది. ఈసారి నవ వసంతంలో మోనిత స్థానంలోకి కొత్త నటి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె పేరు గాయత్రి సింహాద్రి. ఇంతకు ముందు యాంకర్ గా అలరించింది.

ఈ సీరియల్ ప్రోమోస్ చూస్తుంటే.. గాయత్రి సింహాద్రి డాక్టర్ బాబు ఇంట్లో ఉండే అమ్మాయి పాత్రలా కనిపిస్తుంది. మోనిత పాత్రలాగే ఈమె రోల్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ బాబును ప్రేమించే అమ్మాయిగా గాయత్రీ కనిపించనుందని సీరియల్ లవర్స్ అంటున్నారు.

గాయత్రి ఇంతకు ముందు ముద్ద మందారం, త్రినయని వంటి సీరియల్లో నటించింది. అలాగే జోష్ షోలో యాంకర్ గా చేసింది. పలు టీవీ షోలలో సందడి చేసింది గాయత్రి. ఇక ఇప్పుడు కార్తీక దీపం నవ వసంతంలో ముఖ్య పాత్రలో ఛాన్స్ కొట్టేసింది. మరీ చూడాలి ఇందులో గాయత్రి ఏ రేంజ్ లో మెప్పిస్తుందో.





























