AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emraan Hashmi: ఇమ్రాన్ హష్మీ గురించి ఆసక్తికర విషయాలు.. ‘ఓజీ’ విలన్‌కు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా?

ఇమ్రాన్ హష్మీ సినిమా రంగంలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోయిన్లతో కిస్సింగ్ సీన్స్, రొమాంటిక్ సీన్లలో ఎక్కువగా నటిస్తూ బాలీవుడ్ సీరియల్ కిస్సర్ గా గుర్తింపు పొందాడు. అయితే ఇటీవల అతను తన ప్రతినాయక పాత్రలతోనూ అభిమానులను అలరిస్తున్నాడు.

Emraan Hashmi: ఇమ్రాన్ హష్మీ గురించి ఆసక్తికర విషయాలు.. 'ఓజీ' విలన్‌కు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా?
Emraan Hashmi
Basha Shek
|

Updated on: Mar 24, 2024 | 7:01 PM

Share

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఆదివారం (మార్చి 24) తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇమ్రాన్ హష్మీ సినిమా రంగంలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోయిన్లతో కిస్సింగ్ సీన్స్, రొమాంటిక్ సీన్లలో ఎక్కువగా నటిస్తూ బాలీవుడ్ సీరియల్ కిస్సర్ గా గుర్తింపు పొందాడు. అయితే ఇటీవల అతను తన ప్రతినాయక పాత్రలతోనూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ 2003లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘ఫుట్‌పాత్‌’ ఆయన తొలి సినిమా. 20004లో వచ్చిన ‘మర్డర్’ సినిమా సూపర్ హిట్ అయింది. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నాడు. 2006లో విడుదలైన ‘అక్సర్‌’, ‘గ్యాంగ్‌స్టర్‌’ చిత్రాలు కూడా మంచి ప్రశంసలు అందుకున్నాయి. ఇమ్రాన్ హష్మీ గతేడాది హిందీలో ‘సెల్ఫీ’, ‘టైగర్ 3’ చిత్రాల్లో నటించారు. ‘సెల్ఫీ’ ఫ్లాప్ అయితే, ‘టైగర్ 3’ ఓ మోస్తరు విజయం సాధించింది.

ఇక ఇమ్రాన్ హష్మీ నికర ఆస్తుల విలువ 105 కోట్ల రూపాయల కంటే ఎక్కువేనని తెలుస్తోంది. ఆయన ఒక్కో సినిమాకు 5-6 కోట్లు పారితోషికం తీసుకుంటాడు. అలాగే ఒక్కో బ్రాండ్‌ను ప్రమోట్ చేసినందుకు కనీసం రూ.2 కోట్లు అందుతాయి. ఇమ్రాన్ హష్మీ ముంబైలోని 4 బీహెచ్‌కే ఇంట్లో నివసిస్తున్నారు. అతనితో పాటు తన భార్య పర్వీన్ షహానీ హష్మీ, కొడుకు ఆర్యన్‌తో అక్కడే నివసిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ బాలీవుడ్ సీరియల్ కిస్సర్‌గా బాగా ఫేమస్. దీని కారణంగానే కొన్ని సార్లు అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ తన పంథాను మార్చుకున్నాడు. తన పాత్రల ఎంపికను మార్చుకున్నాడు. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమాలో ఐఎస్ఐ ఏజెంట్ గా నటించి విలన్ గా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించేందుకు రెడీ అవుతున్నాడు. ‘ఓజీ’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ కు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

ఓజీ సినిమాలో ఓమీ భాయ్ గా ఇమ్రాన్ హష్మీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..