Samantha: మీ ప్రేమకు దాసోహం.. అభిమానుల ముందుకు వచ్చిన సమంత.. ఎమోషనల్ మూమెంట్స్..
ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత సామ్ ఫ్యాన్స్ మీట్ పెట్టింది. పలువురు అభిమానులను నేరుగా కలిసింది. తనను కలిసేందుకు వచ్చిన ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించింది. అలాగే వారందరితో కలిసి ఫోటోస్ దిగింది. చాలా మంది ఫ్యాన్స్ సామ్ కోసం అనేక బహుమతులు తీసుకోచ్చారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేసి సందడి చేసింది. అయితే చాలా కాలం తర్వాత సమంతను చూసిన అభిమానులు ఎమోషనల్ అయ్యారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో సమంత ప్రత్యేకం. ఏమాయ చేసావే సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమైన సామ్ అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకుంది. కంటెంట్ ప్రాధాన్యత.. బలమైన పాత్రలను ఎంచుకుని నటనకు ప్రశంసలు అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే వ్యక్తిగత విషయాలు.. అనారోగ్య సమస్యలు ఆమె జీవితాన్ని కుదిపేశాయి. ప్రేమ, పెళ్లి, విడాకులతో మానసిక సంఘర్షణకు గురైంది. ఆ వెంటనే భయంకరమైన మయోసైటిస్ సమస్యతో పోరాడుతున్నట్లు ప్రకటించింది. చాలా కాలంగా సామ్ ఆటోఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మయోసైటిస్ నుంచి కాస్త కోలుకున్న వెంటనే శాకుంతలం, యశోధ, ఖుషి చిత్రాలను కంప్లీట్ చేసింది. ఇక ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సామ్. కొన్నాళ్లుగా మూవీ ఈవెంట్లకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడిప్పుడే తిరిగి యాక్టివ్ అయ్యింది. కొద్ది రోజులుగా సిటాడెల్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అటు సోషల్ మీడియాలోనూ లేటేస్ట్ స్టైలీష్ గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ హంగామా చేస్తుంది.
ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత సామ్ ఫ్యాన్స్ మీట్ పెట్టింది. పలువురు అభిమానులను నేరుగా కలిసింది. తనను కలిసేందుకు వచ్చిన ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించింది. అలాగే వారందరితో కలిసి ఫోటోస్ దిగింది. చాలా మంది ఫ్యాన్స్ సామ్ కోసం అనేక బహుమతులు తీసుకోచ్చారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేసి సందడి చేసింది. అయితే చాలా కాలం తర్వాత సమంతను చూసిన అభిమానులు ఎమోషనల్ అయ్యారు. ఓ మహిళా సామ్‌ను హగ్ చేసుకుని భావోద్వేగానికి గురవ్వగా.. ఆమెను ఓదార్చింది. అభిమానుల ప్రేమను చూసి సామ్ సైతం ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
Sam familyyy..💗 We love u sam 🥹🫶 A day to be remembered ☺️#SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/osblLqDx7g
— RUCHISAM🫶♥️ (@Ruchisam12) March 24, 2024
And Finally , dream of a fan boy from 12.5 Years became reality 🫶 Sam @Samanthaprabhu2 🥺❤️ You’re the best and I’ll love you forever and ever Words are falling short to describe how it is to be with you 🫶 Thanks a lot @sravan523 bro ❤️🤗#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/matmypuCZ9
— Anil Aniee (@Anil_Aniee) March 24, 2024
ఇదిలా ఉంటే.. ఖుషి సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకుంది సామ్. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించనున్నారు. త్వరలోనే సామ్ మరిన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Meeting her and taking pics with her is a dream ❤
Finally on 23-03-2024 I met my Favourite Actress and interacted with her like a friend 💗
Will cherish this memorable moment everyday in my life. Thank you @Samanthaprabhu2 for your time ❤️❤️ I love you ✨ #SamanthaRuthPrabhu pic.twitter.com/nYYFSYbeNy
— HaRshi 🧚♀ (@Harshi_74) March 24, 2024
#SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/2vVmQnOMxN
— Star Gallery (@stargallery2020) March 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




