Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అందమైన అమ్మాయిగా ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టరా ?.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్..

కలువ కన్నులు.. చక్కటి చిరునవ్వుతో... ఎప్పటికీ మర్చిపోలేని అందమైన రూపంతో వయ్యారంగా కూర్చున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టండి.. కానీ ఆ ఫోటోలో ఉన్నది హీరోయిన్ అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఆ ఫోటోలో కనిపిస్తున్న సుందరి అమ్మాయి మాత్రం కాదు.. మీరు జాగ్రత్తగా చూస్తే అతడెవరో కనిపెట్టొచ్చు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించారు. అలాగే క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఇంతకీ అతడెవరో గుర్తుపట్టారా ?..

Tollywood: అందమైన అమ్మాయిగా ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టరా ?.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 24, 2024 | 5:33 PM

అందమైన అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ కాస్ట్యూమ్‏లో నవ్వుతూ కట్టిపడేస్తుంది. కలువ కన్నులు.. చక్కటి చిరునవ్వుతో… ఎప్పటికీ మర్చిపోలేని అందమైన రూపంతో వయ్యారంగా కూర్చున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టండి.. కానీ ఆ ఫోటోలో ఉన్నది హీరోయిన్ అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఆ ఫోటోలో కనిపిస్తున్న సుందరి అమ్మాయి మాత్రం కాదు.. మీరు జాగ్రత్తగా చూస్తే అతడెవరో కనిపెట్టొచ్చు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించారు. అలాగే క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఇంతకీ అతడెవరో గుర్తుపట్టారా ?.. తనే సీనియర్ హీరో వినీత్. ఇలా చెబితే గుర్తుపడతారా ?.. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అయిన ప్రేమదేశం సినిమా హీరో.

చిన్న వయసులోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాడు వినీత్. ఆ తర్వాత 1985లో రిలీజ్ అయిన ఇదనిళంగ సినిమాతో తెరంగేట్రం చేశారు. అలాగే 1993లో వచ్చిన జెంటిల్ మెన్ సినిమాలో నటించారు. 1994లో వచ్చిన సరిగమలు సినిమాలో హీరోగా కనిపించారు వినీత్. ఆ త్రవాత ఆరో ప్రాణం, ప్రేమదేశం, రుక్మిణి, w/o వరప్రసాద్, నీ ప్రేమకై, లాహిరి లాహిరి లాహిరిలో ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించాడు.

కేరళలలోని కన్నూర్ ప్రాంతానికి చెందిన వినీత్.. తన విద్యాభ్యాసాన్ని తలస్సేరిలోని సెయింట్ జోసెఫ్ బాలుర ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. సీనియర్ హీరోయిన్ శోభనకు వినీత్ కజిన్ అవుతాడు. పాఠశాల రోజులలోనే భరతనాట్యంలో అనేక బహుమతులు గెలుచుకున్నారు. రాష్ట్రస్థాయి స్కూల్ యూత్ ఫెస్టివల్‌లో భరతనాట్యం పోటీల్లో వరుసగా నాలుగుసార్లు ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆయనకు కళాత్మక మేధావి అనే బిరుదు కూడా ఉంది. కేవలం హీరోగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగాను వర్క్ చేశారు. ఇక చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న వినీత్ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్నారు. నితిన్ నటించిన రంగ్ దే సినిమాలో కీలకపాత్రలో కనిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్
రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్
మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!
మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!
అందరి ముందే సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
అందరి ముందే సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముసలానికి కారణాలివే! టాలీవుడ్‌పైనా..
మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముసలానికి కారణాలివే! టాలీవుడ్‌పైనా..
భారత్‌కు డోజ్‌ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన ఇదే..
భారత్‌కు డోజ్‌ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన ఇదే..
వేసవిలో శరీర వేడిని తగ్గించేందుకు బెస్ట్ హోమ్ డ్రింక్స్ మీకోసం..!
వేసవిలో శరీర వేడిని తగ్గించేందుకు బెస్ట్ హోమ్ డ్రింక్స్ మీకోసం..!
చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? తొలగించేందుకు హోమ్‌ రెమిడీస్‌!
చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? తొలగించేందుకు హోమ్‌ రెమిడీస్‌!
మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి..
మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి..
శాంసంగ్‌ నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌకైన 5G మొబైల్ ఫోన్‌!
శాంసంగ్‌ నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌకైన 5G మొబైల్ ఫోన్‌!