Actress Meena: ఆ స్టార్ హీరోతో రెండో పెళ్లంటూ వార్తలు.. ప్రముఖ నటి మీనా ఏమన్నారంటే?

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ముఖ్యంగా పెళ్లి, రిలేషన్ షిప్, బాయ్ ఫ్రెండ్.. ఇలా హీరోయిన్ల పర్సనల్ లైఫ్ విషయాలపై ఎన్నో రూమర్లు పుట్టుకొస్తుంటాయి. అలా ఈ మధ్యన ప్రముఖ నటి మీనా వ్యక్తిగత జీవితం గురించి  నెట్టింట పలు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి.

Actress Meena: ఆ స్టార్ హీరోతో రెండో పెళ్లంటూ వార్తలు.. ప్రముఖ నటి మీనా ఏమన్నారంటే?
Actress Meena
Follow us
Basha Shek

|

Updated on: Mar 24, 2024 | 4:31 PM

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ముఖ్యంగా పెళ్లి, రిలేషన్ షిప్, బాయ్ ఫ్రెండ్.. ఇలా హీరోయిన్ల పర్సనల్ లైఫ్ విషయాలపై ఎన్నో రూమర్లు పుట్టుకొస్తుంటాయి. అలా ఈ మధ్యన ప్రముఖ నటి మీనా వ్యక్తిగత జీవితం గురించి  నెట్టింట పలు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఆమె రెండో పెళ్లి చేసుకోనుందంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. వీటిపై ఇప్పటికే పలు మార్లు క్లారిటీ ఇచ్చింది మీనా. అయినా నెట్టింట మీనాపై దాడి జరుగుతూనే ఉంది. వివరాల్లోకి వెళితే.. సుమారు 30 ఏళ్ల పాటు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా ఇప్పుడు స్పెషల్ రోల్స్ తో సందడి చేస్తోంది. అయితే కొన్ని నెలల క్రితం ఈ అందాల తార జీవితంలో ఒక పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యా సాగర్ హఠాన్మరణం చెందారు. దీంతో మీనా, ఆమె కూతురు నైనా ఒంటరివారైపోయారు. ఇలాంటి సమయంలో వారికి అండగా నిలవాల్సింది పోయి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరో ధనుష్ తో ఆమెను లింక్ చేస్తున్నారు. రెండో పెళ్లి అంటూ నెట్టింట రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. వీటిపై పలుమార్లు స్పందించిన మీనా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి ఇదే విషయంపై స్పందించిందామె.

‘డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్‌ మీడియా రోజు రోజుకు మరింత దిగజారిపోతుంది. నిజాలు తెలుసుకుని రాయండి. అది అందరికీ మంచిది. దేశంలో నాలాగే ఒంటరిగా జీవించే మహిళలు చాలామంది ఉన్నారు. మా అమ్మానాన్నలు, కూతురు భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచించండి. ప్రస్తుతానికి రెండో పెళ్లి గురించి ఎటువంటి ఆలోచనలు లేవు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో తెలియదు. వాటి గురించి ఇప్పుడు ఎలా చెబుతాను. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఉంటే తప్పకుండా నేనే బహిరంగంగా ప్రకటిస్తాను. అంతవరకు ఇలాంటి పుకార్లను సృష్టించవద్దు.. ఎవరూ పట్టించుకోవద్దు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది మీనా. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మీనా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

మీనా గ్లామరస్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.