బాలనటిగా వెండితెరపై సీనిరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత టాప్ హీరోయిన్గా ఎదిగారు మీనా. సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, రజినీకాంత్, బాలకృష్ణ, మమ్ముట్టి, మోహన్ లాల్ హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించింది.