Hollywood: హాలీవుడ్ చిత్రాలకి మన ఇతిహాసాలే స్పూర్తి.. మరి ఆ సినిమాలు ఏంటి.?

మన దేవుళ్లకు మన దగ్గరే కాదు.. హాలీవుడ్‌లోనూ గిరాకీ పెరిగిపోయింది. అక్కడి కథలకు కూడా భారతీయ ఇతిహాసాలే స్పూర్తిగా నిలుస్తున్నాయి. రామాయణ భారతాలను దాటి ఏ కథలు దర్శకులు రాయలేకపోతున్నారు. ఆ మధ్య క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో కృష్ణుడి ప్రస్థావన వస్తే.. ఇప్పుడేమో హనుమంతుడు కనిపిస్తున్నారు. మరి అంజనీ పుత్రుడి నేపథ్యంతో వస్తున్న ఆ సినిమా ఏంటి..?

| Edited By: Prudvi Battula

Updated on: Mar 25, 2024 | 6:30 AM

ఇండియన్ సినిమాల్లోనే కాదు.. మన ఇతిహాసాల ప్రభావం హాలీవుడ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. గతేడాది ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్‌కు మన భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన భోధనలే స్పూర్థి.

1 / 5
మొదటి అణుబాంబు ప్రయోగంపై వచ్చిన ఈ చిత్రంలో.. శ్రీ కృష్ణుడు చెప్పిన..‘సృష్ఠించింది నేనే నాశనం చేసింది నేనే’ అనే శ్లోకమే అణుబాంబు తయారీకి కారణమైనట్లు తెలిపారు ఓపెన్ హైమర్. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.

2 / 5
తాజాగా మంకీ మ్యాన్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు స్లమ్‌డాగ్ మిలీనియర్ ఫేమ్ దేవ్ పటేల్. ఇందులో ఆయనే హీరో. హనుమంతుడి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో హీరో కారెక్టర్‌కు హనుమాన్ ఛాయలుంటాయి. అంజనీ పుత్రుడి అంశతో ఉన్న హీరో.. మాఫియాపై ఎలా తిరగబడ్డాడనే పాయింట్ మీద మంకీ మ్యాన్ సాగుతుంది. ఎప్రిల్ 19న విడుదల కానుంది మంకీ మ్యాన్.

3 / 5
అవతార్ 2లోనూ రామాయణ మహాభారత ఛాయలున్నాయి. ఇందులో హీరో తన కుటుంబంతో పాటు సముద్ర జీవుల దగ్గర రహస్యంగా తల దాచుకునే సీన్.. భారతంలోని విరాట పర్వంను తలపిస్తున్నాయి.

4 / 5
వానరుల సాయంతో లంకను గెలిచిన రాముడిలా.. సముద్ర వాసుల సాయంతో భూలోక వాసులపై విజయం సాధిస్తారు హీరో. మొత్తానికి కథేదైనా.. మన ఇతిహాసాలను దాటిపోవని వీటిని చూస్తుంటేనే అర్థమవుతుంది.

5 / 5
Follow us