ఐపీఎల్ 2024: హార్దిక్‌కు షాక్‌.. మళ్లీ రోహిత్‌కే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు!

ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ నాయకత్వ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. ఫ్రాంఛైజీ యాజమాన్యం, యాజమాన్యం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, గుజరాత్ టైటాన్స్ ట్రేడ్ విండో ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబైకి అప్పగించింది.

ఐపీఎల్ 2024: హార్దిక్‌కు షాక్‌.. మళ్లీ రోహిత్‌కే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు!
Rohit Sharma, Hardik Pandya
Follow us
Basha Shek

|

Updated on: Mar 26, 2024 | 5:19 PM

ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ నాయకత్వ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. ఫ్రాంఛైజీ యాజమాన్యం, యాజమాన్యం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, గుజరాత్ టైటాన్స్ ట్రేడ్ విండో ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబైకి అప్పగించింది. అయితే ఇంత జరిగినా హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మల అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీని కోల్పోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకనొకదశలో సునాయస విజయం సాధించేలా కనిపించిన ముంబై బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం పాలైంది. దీంతో హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అలాగే మరోసారి రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇదే విషయంపై సన్ రైజర్స్ మాజీ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

‘మొదటి మ్యాచ్‌లో ఓడిన తర్వాత ముంబై ఇండియన్స్ భయపడాల్సిన అవసరం లేదు. కొత్త కెప్టెన్‌కి కాస్త సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఐదు లేదా ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత అకస్మాత్తుగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ రోహిత్ శర్మకు వెళితే ఆశ్చర్యంగా ఉంటుంది. ముందు ముందు ఆలోచించే హార్దిక్‌కి ముంబై ఇండియన్స్ బాధ్యతలు అప్పగించింది. హార్దిక్ పాండ్యాలో నాయకత్వ లక్షణాలన్నీ ఉన్నాయి. అవి బయటపడాలంటే కొంత సమయం ఇవ్వాలి’ అని చెప్పుకొచ్చారు టామ్ మూడీ.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. గాయం తర్వాత హార్దిక్ పాండ్యా ఈ క్రికెట్ గ్రౌండ్‌కు తిరిగి వచ్చాడు. కానీ హార్దిక్ పాండ్యా తనదైన ముద్ర వేయలేకపోయాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. హార్దిక్ 3 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. బ్యాటింగ్‌లో 11 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై 45 పరుగులతో దూకుడుగా ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..