RCB: కాక నువ్వు కేక.. టీ20ల్లో టెస్ట్ బ్యాటింగ్.. గగ్గోలు పెడుతోన్న ఆర్సీబీ ఫ్యాన్స్..
ఐపీఎల్ 2024 సీజన్‌లో బెంగళూరు జట్టు తొలి విజయాన్ని అందుకుంది. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. రన్ మిషన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీకి తోడు దినేష్ కార్తీక్ అద్భుతమైన ఫినిషింగ్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఈ సీజన్‌లో తొలి గెలుపును అందించాయి.

ఐపీఎల్ 2024 సీజన్‌లో బెంగళూరు జట్టు తొలి విజయాన్ని అందుకుంది. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. రన్ మిషన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీకి తోడు దినేష్ కార్తీక్ అద్భుతమైన ఫినిషింగ్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఈ సీజన్‌లో తొలి గెలుపును అందించాయి. ఇంతవరకూ బాగానే ఉంది.. కానీ ఇంతటి థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్నా.. ఆర్సీబీ ఫ్యాన్స్ జట్టులో ఓ ప్లేయర్‌ను తీసేయాలని ఇంటర్నెట్ వేదికగా గగ్గోలు పెడుతున్నారు. అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటే.. జట్టుకు భారీ నష్టమని.. అతడి స్థానంలో వేరొక ప్లేయర్‌ను ఆడించాలని కోరుతున్నారు. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత ఎదుర్కుంటున్న ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..
అతడు మరెవరో కాదు రజిత్ పాటిదార్. ఐపీఎల్ 2021లో అరంగేట్రం చేసిన రజత్.. ఆ సీజన్‌లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే ఆ తర్వాతి సీజన్‌లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో కేవలం 8 మ్యాచ్‌ల్లో 333 పరుగులు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే గాయం కారణంగా ఐపీఎల్ 2023 పూర్తిగా దూరమయ్యాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఆర్సీబీ జట్టులోకి తిరిగొచ్చిన రజత్.. జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ పూర్తిగా విఫలమయ్యాడు. చెన్నైతో మ్యాచ్‌లో డకౌట్ కాగా.. రెండో మ్యాచ్‌లో 18 పరుగులకే అవుట్ అయ్యాడు.
ఏముంది..! ప్లేయర్ అన్నాక పేలవ ఫామ్‌లో ఉన్నట్టయితే.. ఇలానే ఆటలో విఫలమవుతారని అనుకోవచ్చు. కాదండీ.! పాయింట్ ఏంటంటే.. ఆటలో అతడి ఇంటెంట్ సరిగ్గా లేదని ఆర్సీబీ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. రెండు మ్యాచ్‌లలోనూ కేర్‌లెస్ బ్యాటింగ్‌తోనే మూల్యం చెల్లించుకున్నాడని అంటున్నారు. ఎంత టీం బాగున్నా.. ఇలాంటి ఓ ప్లేయర్ సీజన్ చివరికి భారీ నష్టాన్ని మిగిలిస్తున్నాడని చెబుతున్నారు. రజత్ పాటిదార్ మిగిలిన మ్యాచ్‌లకు కంటిన్యూ చేయకుండా.. నెక్స్ట్ మ్యాచ్ నుంచే బెంచ్‌కి పరిమితం చేయాలని కోరుతున్నారు. కాగా, ఆర్సీబీలో కీలకమైన మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు రజత్ పాటిదార్. అలాంటి స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు.. ఆచితూచి ఆడకుండా.. ఇలా కేర్‌లెస్‌గా వికెట్ పారేసుకుంటే.. జట్టుపై భారీ ఇంపాక్ట్ పడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత.. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. అయితే ఆ సిరీస్‌లోనూ పెద్దగా రాణించలేకపోయాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్‌లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది.




