CSK vs GT, Playing XI, IPL 2024: టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్.. ఇరుజట్ల ప్లేయింగ్-XI ఎలా ఉందంటే?
Chennai Super Kings vs Gujarat Titans Confirmed Playing XI in Telugu: చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా మరికాసేపట్లో యువ కెప్టెన్ల సమరం జరగనుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK), శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ (GT) హోరాహోరీగా తలపడనున్నాయి

Chennai Super Kings vs Gujarat Titans Confirmed Playing XI in Telugu: చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా మరికాసేపట్లో యువ కెప్టెన్ల సమరం జరగనుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK), శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ (GT) హోరాహోరీగా తలపడనున్నాయి. గత ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఇరు జట్లు తొలిసారి తలపడుతున్నాయి కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ ఉత్కంఠభరితమైన పోటీని ఆశించవచ్చు. అయితే ఈసారి రెండు టీమ్‌లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగనున్నారు. గత ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్నప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నారు. ఇప్పుడు రెండు జట్ల కెప్టెన్లు మారారు. ఇక గత రికార్డుల విషయానికి వస్తే.. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. గుజరాత్ టైటాన్స్ 3 మ్యాచ్ ల్లో గెలుపొందగా, చెన్నై సూపర్ కింగ్స్ 2 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఈ మ్యాచ్ ద్వారా సీఎస్‌కే విక్టరీ మార్జిన్‌ను సమం చేస్తుందనే నమ్మకంతో ఉంది
కాగా ఈ మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. తీక్షణ స్థానంలో పతిరనకు అవకాశం లభించింది. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఎలాంటి మార్పు లేదు. కాగా పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందని తెలుస్తోంది. హె డెన్ ప్రకారం, టాస్ గెలిచిన తర్వాత మొదట బ్యాటింగ్ చేయడం ఉత్తమం.
గుజరాత్ ప్లేయింగ్ ఎలెవన్ –
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్.
That’s how we line up against #CSK! 💪
We won the toss and will bowl first. #AavaDe | #GTKarshe | #TATAIPL2024 | #CSKvGT | @Dream11 #PaidPartnership pic.twitter.com/HT4G5Vo923
— Gujarat Titans (@gujarat_titans) March 26, 2024
చెన్నై ప్లేయింగ్ ఎలెవన్-
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, డారెల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, పతిరణ, ముస్తిఫిజుర్ రెహమాన్.
Display of Yellove as we make our way to Anbuden! 💛
Send us your Yellovely selfies and pictures with #FANCAM #CSKvGT #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/88f5U6JQvI
— Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








