RCB IPL 2024 Full Schedule: ఆర్సీబీ పూర్తి షెడ్యూల్ ఇదే.. బెంగళూరులో ఎన్ని మ్యాచ్‌లున్నాయంటే?
సార్వత్రిక ఎన్నికల కారణంగా ముందుగా తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేశారు. ప్రస్తుతం పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఫైనల్ మ్యాచ్ మే 26 ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. RCB ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడగా, ఒకదానిలో గెలిచి, మరొకటి గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ పూర్తి షెడ్యూల్ ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్- 2024)లో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది . దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ముందుగా తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేశారు. ప్రస్తుతం పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఫైనల్ మ్యాచ్ మే 26 ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. RCB ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడగా, ఒకదానిలో గెలిచి, మరొకటి గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ పూర్తి షెడ్యూల్ ఇప్పుడు చూద్దాం.
ఆర్సీబీ ఫుల్ షెడ్యూల్ ఇదే..
- RCB vs KKR- 7:30pm- మార్చి 29- బెంగళూరు
- RCB vs LSG- 7:30 PM- ఏప్రిల్ 2- బెంగళూరు
- RR vs RCB- 7:30pm- ఏప్రిల్ 6- జైపూర్
- MI vs RCB- 7:30pm- ఏప్రిల్ 11- ముంబై
- RCB vs SRH- 7:30pm- ఏప్రిల్ 15- బెంగళూరు
- KKR vs RCB- 3:30 PM- ఏప్రిల్ 21- కోల్‌కతా
- SRH vs RCB- 7:30pm- ఏప్రిల్ 25- హైదరాబాద్
- GT vs RCB- 3:30 PM- ఏప్రిల్ 28- అహ్మదాబాద్
- RCB vs GT- 7:30 PM- మే 4- బెంగళూరు
- PBKS vs RCB- 7:30pm- మే 9- ధర్మశాల
- RCB vs DC- 7:30 PM- మే 12- బెంగళూరు
- RCB vs CSK- 7:30 PM- మే 18- బెంగళూరు
కాగ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్ ధాటికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్-5 బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. మే 18న బెంగళూరులో ఆర్‌సిబి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. దీన్ని ప్రతీకారంగానే చూడాలి. ఇక ఐపీఎల్ 2024 సీజన్‌లో సోమవారం పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ఖాతా తెరిచింది. అది కూడా సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో. హోలీ రోజు జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పంజాబ్ బౌలర్లకు చెమటలు పట్టించి బెంగళూరు జట్టును గెలిపించాడు. 77 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు కోహ్లీ. దినేష్ కార్తీక్ కేవలం 10 బంతుల్లో 28 పరుగులతో ఆర్సీబీ ని గెలుపు తీరాలకు చేర్చాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయేష్ ప్రభుదేశాయ్, విల్ జాక్వెస్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్ కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, ., మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..