IND vs AUS: మరోసారి ఆసీస్‌తో సమరానికి సై.. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది
భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఏడాది చివరలో ప్రారంభమయ్యే ఈ సిరీస్ షెడ్యూల్ ను మంగళవారం (మార్చి 26) ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది
భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఏడాది చివరలో ప్రారంభమయ్యే ఈ సిరీస్ షెడ్యూల్ ను మంగళవారం (మార్చి 26) ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 7 వరకుఅడిలైడ్, బ్రిస్బేన్, మెల్ బోర్న్, సిడ్నీ నగరాల్లో మిగతా నాలుగు టెస్టు మ్యాచ్ లు జరుగుతాయి. పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య జరిగే ఏకైక డే-నైట్ టెస్టు మ్యాచ్ ఇదే. ఇరు జట్లు గులాబీ బంతితో మైదానంలోకి దిగనున్నాయి. ఆ తర్వాత మూడో మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి 18 వరకు బ్రిస్బేన్‌లో జరగనుంది. డిసెంబర్ 26 నుంచి 30 వరకు మెల్‌బోర్న్‌లో జరగనున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్, ఆస్ట్రేలియా మరోసారి తలపడనున్నాయి. సిరీస్‌లో ఇది నాలుగో టెస్టు మ్యాచ్. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ 2025 జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీలో జరగనుంది.
భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్
తొలి టెస్టు: నవంబర్ 22-26: పెర్త్ రెండవ టెస్ట్: 6-10 డిసెంబర్: అడిలైడ్ (పింక్ బాల్ టెస్ట్) మూడో టెస్టు: 14-18 డిసెంబర్: బ్రిస్బేన్ నాల్గవ టెస్ట్: డిసెంబర్ 26-30: మెల్బోర్న్ ఐదవ టెస్ట్: 3-7 జనవరి: సిడ్నీ
BORDER GAVASKAR TROPHY SCHEDULE:
1st Test – 22nd to 26th Nov, Perth. 2nd Test – 6th to 10th Dec, Adelaide (D/N). 3rd Test – 14th to 18th Dec, Gabba. 4th Test – 26th to 30th Dec, MCG. 5th Test – 3rd to 7th Jan, Sydney. pic.twitter.com/nKsPDsQLmE
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2024
32 ఏళ్ల తర్వాత..
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది చివర్లో జరగనున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భారీ మార్పు జరిగింది. ఇంతకుముందు ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఉండగా, ఇప్పుడు ఇరు జట్లు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడనున్నాయి. 1991-92 తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత్, ఆస్ట్రేలియాలు తలపడడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత, ఈ ఏడాది చివరిలో భారత జట్టుకు ఈ టెస్ట్ సిరీస్ చాలా ముఖ్యమైనది.
గత ఏడాది స్వదేశంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌ను భారత జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు, 2020-21లో ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు ఈ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే 2023 WTC ఫైనల్ మ్యాచ్ లో భారతదేశం, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఇందులో పాట్ కమ్మిన్స్ సారథ్యంలోని ఆసీస్ జట్టు భారతదేశాన్ని ఓడించింది.
Cheteshwar Pujara’s unbeaten 82 led India to a 6 wicket win in the 4th Test of the 2013 Border-Gavaskar Trophy, in Delhi (🎥:⬇️) pic.twitter.com/1IsxBb59IH
— Anish Desouza (@ilegally_indian) March 19, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..