Siren OTT: ఓటీటీలో కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. సైరన్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వారం రోజుల గ్యాప్ లో తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన సైరన్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది

Siren OTT: ఓటీటీలో కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. సైరన్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Siren Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 27, 2024 | 8:36 PM

కోలీవుడ్ స్టార్‌ హీరో జయం రవి నటించిన చిత్రం సైరన్. మహానటి కీర్తి సురేశ్ మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌ రోల్ పోషించగా, మరో మలయాళం బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ మరో కీలక పాత్రలో మెరిసింది. గతంలో అభిమన్యుడు, విశ్వాసం వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు రచయితగా పనిచేసిన ఆంటోని భాగ్యరాజ్‌ తొలిసారి మెగా ఫోన్ పట్టి సైరన్‌ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వారం రోజుల గ్యాప్ లో తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన సైరన్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11 నుంచి ఓటీటీలో సైరన్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ సైరన్ స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి తెరకెక్కించిన సైరన్ సినిమాలో భారీ తారగణం ఉంది. సముద్రఖని, యోగిబాబు, అజయ్, యువినా పార్థవి, తులసి, పాండియన్, అళగం పెరుమాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవి ప్రకాశ్ స్వరాలు సమకూర్చగా, సామ్ పీఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. త‌న భార్య మ‌ర‌ణానికి కార‌ణ‌మైన పోలీస్ ఆఫీస‌ర్‌తో పాటు రాజకీయ నాయకులపై ఓ సాధార‌ణ అంబులెన్స్ డ్రైవ‌ర్ ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడ‌న్న‌దే సైరన్ సినిమా. దీనికి తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ను జోడించి ఆద్యంతం ఆసక్తికరంగా సైరన్ సినిమాను రూపొందించాడు డైరెక్టర్.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

సైరన్ సినిమాలో జయం రవి

సైరన్ సినిమాలో కీర్తి సురేశ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.